వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేదార్‌నాథ్ వ్యాలీలో 44 అస్తిపంజరాలు లభ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: కేదార్‌నాథ్ వ్యాలీలో అధికారులు ఇప్పటి వరకు 44 అస్తిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. నిరుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో వరదల కారణంగా భారీ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో గాలింపు చర్యల కోసం డిఐజి జిఎస్ మార్టోలియా నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

కేదార్‌వ్యాలీ ప్రాంతంలో ఇప్పటి వరకు 44 అస్తిపంజరాలు లభ్యమైనట్లు మార్టోలియా తెలిపారు. గత 24 గంటల్లో భారీగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఏ విధమైన అస్తిపంజరాలు లభించలేదని ఆయన చెప్పారు.

44 skeleton remains found in Kedar valley so far

తాము కేదార్‌నాథ్‌కు వెళ్లే గోంకారా వంటి ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టామని, అలాగే త్రిజుగినారాయణ సమీపంలోని తోషీ రోడ్టు వెంట గల లోయల్లో కూడా గాలింపు జరిపామని, తాజాగా ఏ విధమైన శవాలు కనిపించలేదని ఆయన వివరించారు.

ఇంకా శవాలున్నాయనే సమాచారంతో పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో అన్వేషణ సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. శవాలను పూర్తిగా తొలగించే వరకు 22 సభ్యుల ఎస్టీఎప్ గాలింపు కొనసాగుతుందని చెప్పారు. 2013 జూన్ 16,17 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వరదల వల్ల విధ్వంసం చోటు చేసుకుంది. దాని వల్ల రాజకీయ దుమారు కూడా చెలరేగింది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.

English summary
A year after a massive deluge hit Uttarakhand causing extensive damage to areas close to Kedarnath, authorities have so far recovered 44 skeletal remains of the victims from the valley since March this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X