చూస్తుండగానే వరదకు కొట్టుకుపోయిన బ్రిడ్జి(వీడియో)
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఓ వంతెన కుప్పకూలిపోయింది. భారీగా వరద నీరు రావడంతో 44ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వెంతెన మధ్య భాగం మొత్తం కూలిపోయి వరదలో కట్టుకుపోయింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బ్రిడ్జి మొత్తం పొడవు 160మీటర్లు ఉంటుందని, అందులో 76 మీటర్ల మేర వంతెన, పది పిల్లర్లు వరదలో కొట్టుకుపోయాయని అదికారులు చెప్పారు. బ్రిడ్జి కూలిన సమయంలో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.
హిమాజల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నూర్ పూర్ తాలూకాకు, పొరుగునే ఉన్న పంజాబ్ రాష్ట్రానికి మధ్య రాకపోకలు సాగించడానికి ఈ వంతెనను ఉపయోగిచడం జరుగుతోంది. పిల్లర్లు బీటలు వారినట్లు గుర్తించిన అధికారులు.. వరద సమయంలో వాహనాలను బ్రిడ్జిపై నుంచి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.
మహారాష్ట్రలో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగి బ్రిడ్జి కూలిపోవడంతో దానిపైన వెళుతున్న రెండు బస్సులు, ఓ కారు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 37మంది మరణించారు.












Click it and Unblock the Notifications