గోవా లోజైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీల యత్నం, ఒకరు మృతి, 9మందికి గాయాలు

గోవా రాష్ట్రంలోనొ సదా సబ్ జైలు నుండి తప్పించుకొనేందుకు 45 మంది ఖైదీలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ ఖైదీ మరణించాడు. మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడగా,

గోవా సదా సబ్ జైలులో మంగళవారం రాత్రి పూట ఖైదీలకు, జైలు అధికారులకు మద్య స్వల్ప వివాదం చోటుచేసుకొంది. ఈ వివాదం పెద్దదిగా మారింది.

దీంతో ఖైదీలు, జైలు సిబ్బంది మద్య ఘర్షణ చోటుచేసుకొంది.జైలు సిబ్బందిపై ఖైదీలు దాడికి దిగారు. జైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారు.

ఈ జైలులో ఉన్న ఖైదీల్లో సుమారు 45 మంది ఖైదీలు జైలు నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు జైలు నుండి ఖైదీలు తప్పించుకోకుండా అడ్డుకొన్నారు.

45 inmates try to escape from a prison in Goa, attack police officials

ఈ క్రమంలో ఓ ఖైదీ మరణించగా, మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో గాయపడిన ఖైదీలను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ ఘటనకు పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన జైలు వద్ద పోలీసులు అదనపు సిబ్బందిని తరలించారు.జైలును పూర్తిగా ధ్వంసం చేశారు ఖైదీలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+