
Shock: చర్చిలో రీట్రీట్ ప్రోగ్రామ్, 480 మంది మీద ఎఫ్ఐఆర్, సీసీటీవీ కెమెరాల్లో ?, కలెక్టర్ ఎంట్రీతో !
తిరువనంతపురం/ చెన్నై: చర్చిలో కరోనా వైరస్ (COVID-19) నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఏకంగా 480 మంది మీద కేసు పెట్టడం కలకలం రేపింది. దేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో CSI చర్చిలో కోవిడ్ నియమాలు ఉల్లంఘించి రీట్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ చర్చి ఫాదర్ తో పాటు ఆ చర్చి నిర్వహకులతో సహ 480 మంది మీద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. చర్చిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ ఆధారం ఇప్పటికే విచారణ మొదలైయ్యింది జిల్లా కలెక్టర్ మీడియాకు చెప్పారు.
Illegal
affair:
యోగా
టీచర్,
లాయర్
సీక్రెట్
లవ్
స్టోరి,
చంపేసి
బాత్
రూమ్
లో
పూడ్చేశాడు!

ఫేమస్ సీఎస్ఐ చర్చి
కేరళ (దక్షిణ కేరళ) రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని మున్నార్ లో సీఎస్ఐ చర్చి ఉంది. గతనెలలో కోవిడ్ నియమాలు ఉల్లంఘించి చర్చిలో రీట్రీట్ కార్యక్రమం నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు చర్చిలో కోవిడ్ నియమాలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ ఎంట్రీ
చర్చిలో కోవిడ్ నియమాలు ఉల్లంఘించి రీట్రీట్ కార్యక్రమం నిర్వహించారా ? అనే విషయం విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఇడుక్కి జిల్లా అధికారి హెచ్. దినేశన్ దేవీకులం డిప్యూటీ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ఐ చర్చిలో కోవిడ్ నియమాలు ఉల్లంఘించి రీట్రీట్ కార్యక్రమం నిర్వహించారని జిల్లా కలెక్టర్ దినేశన్ కు నివేదిక అందింది.

480 మంది మీద ఎఫ్ఐఆర్.... సీసీటీవీ కెమెరాలు
ఇడుక్కి జిల్లా కలెక్టర్ దినేశన్ ఆదేశాల మేరకు చర్చిలో రీట్రీట్ కార్యక్రమం నిర్వహించిన చర్చి ఫాదర్, చర్చి నిర్వహకులతో పాటు మొత్తం 480 మంది మీద కేసులు నమోదు చేశామని డీఎస్పీ పీఆర్. సురేష్ స్థానిక మీడియాకు చెప్పారు. చర్చిలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ ఆధారంగా విచారణ చేస్తున్నామని డీఎస్పీ సురేష్ అన్నారు. కోవిడ్ నియమాలు ఉల్లంఘించి అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యారని ఆరోపిస్తూ కేసులు నమోదు కావడం కేరళలో హాట్ టాపిక్ అయ్యింది.