పాట్నా ప్యాసింజర్‌కు అగ్ని ప్రమాదం: ఐదు బోగీలు దగ్ధం

Subscribe to Oneindia Telugu
  పాట్నా ప్యాసింజర్‌కు అగ్ని ప్రమాదం

  పాట్నా: బీహార్‌ రాష్ట్రంలోని మొకామా రైల్వేస్టేషన్‌ యార్డ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా పాట్నా-మొకామా ప్యాసింజర్‌ రైలు మంటల్లో కాలిపోయింది. ఐదు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

  ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో జరిగింది. ముందుగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే మంటలు మరో రెండు మూడు బోగీలకు వ్యాపించాయి.

  5 bogies and engine of Patna-Mokama passenger train gutted, no casualties

  అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద కారణాలపై రైల్వే భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Five bogies and an engine of Patna-Mokama passenger train stationed at the Mokama railway station was gutted after a fire broke out in one of the bogies on the intervening night of Tuesday and Wednesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X