ఫైర్ ఫ్యాక్టరీలో పేలుడు: 5గురు మృతి, 17 మంది పరిస్థితి విషమం
పాట్నా: బీహార్‌లోని నలంద జిల్లాలో ఓ అక్రమ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 5గురు మరణించగా, 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 17 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
పేలుడు ధాటికి కర్మాగారానికి సమీపంలో ఉన్న ఐదు ఇళ్లు చాలా వరకు ధ్వంసమయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు శుక్రవారం వేకువజామున 5 గంటలకు జరిగింది.
#Visuals from Nalanda's Jalalpur, where a blast took place in an illegal firecracker factory. One dead, 25 injured in the blast. Investigation is underway. pic.twitter.com/eYP4hrrUHm
— ANI (@ANI) March 23, 2018
పోలీసు బలగాలు, ఫైర్ టెండర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు వల్ల సంభవించిన మంటలను అదుపు చేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది.
కర్మాగారం నలంద జిల్లాలోని జలాల్పూర్‌లో ఉంది. పేలుడుకు గల కారణమేమిటనేది తెలియదు. నలంద డిఎం, ఎస్పీ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు, నిందితులను అరెస్టు చేయనున్నట్లు వారు చెప్పారు.
సంబంధిత పోలీసు స్టేషన్ ఇంచార్జీని సస్పెండ్ చేశారు. పేలుడుపై దర్యాప్తునకు ఎనిమిది సభ్యులు గల ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) అక్కడికి చేరుకుంది.












Click it and Unblock the Notifications