వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: ఐదుగురు ఆజాద్ అనుచరుల రాజీనామా..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి వరుష షాకులు తగులుతున్నాయి. గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆనంద్ శర్మ పార్టీ నుంచి వైదొలిగారు. ఇప్పుడు ఆజాద్ తర్వాత కశ్మీరీ కాంగ్రెస్ నేతలు కూడా అదేబాట పడుతున్నారు. వీరంతా ఆజాద్‌కు మద్దతుగా రాజీనామా చేసిన వరకే. కాంగ్రెస్ పార్టీ వినాశనానికి రాహుల్ గాంధీయే కారణం అని వారు ఆరోపించారు. వీరంతా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు.

గులామ్ మహ్మద్ సరూరీ, హజీ అబ్దుల్ రషీద్, మహ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వనీ, చౌదరీ అక్రమ్ మహ్మద్, సల్మాన్ నిజానీ తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గులాంనబీ ఆజాద్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆజాద్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వ్యవస్థాగత ఎన్నికలు, లీడర్ షిప్ కమిటీ ఫ్రాడ్ అంటూ విరుచుకుపడ్డారు. మరికొన్ని ఇంటర్నల్ సమ్యల్యుు అంటూ ఫైరయ్యారు.

5 J&K leaders quit after Ghulam Nabi Azads resignation

ఈ మేరకు ఆజాద్ ఒక లేఖ కూడా రాశారు. అందులో రాహుల్ గాంధీని నిందించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వినాశనం జరుగుతుందని.. రాహుల్ గాంధీ సెక్యూరిటీ గార్డులు, పీఏలు నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీనియర్ నేతలను పక్కన పెట్టారని ఆరోపించారు. అనుభవం లేదని వారికి పార్టీ వ్యవహారాలను అప్పగించారని పేర్కొన్నారు. పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదంటూ వాపోయారు.

English summary
Five Jammu and Kashmir Congress leaders and ex-MLAs have quit the party in solidarity with Ghulam Nabi Azad who resigned earlier in the day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X