మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకుంటే..: సుప్రీం జడ్జిల పరిశీలన

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలకు శిక్ష వేయవచ్చునా అనే అంశాన్ని సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల పరిశీలించనున్నారు. 19వ శతాబ్ది క్రిమినల్ చట్టం పురుషులను శిక్షించడానికి మాత్రమే అనుమతిస్తుంది. మహిళలను శిక్షించే నిబంధన అందులో లేదు

సామాజిక ముందడుగును, లైంగిక సమానత్వాన్ని, సెన్సివిటీని దృష్టిలో పెట్టుకుని గతంలో వచ్చిన తీర్పుల నేపథ్యంలో దాన్ని తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు అభిప్రాయపడింది

5 Supreme Court Judges to Decide If Women Can Be Punished For Adultery

ఐపిసి 497 మహిళల పట్ల వివక్ష చూపడం లేదనే 1954, 1985 తీర్పులతో తాము ఏకీభవించడం లేదని సుప్రీంకోర్టు అన్నది. భారత శిక్షా స్మృతి 497 సెక్షన్ ప్రకారం పురుషుడిని నిందితుడు, మహిళ బాధితురాలు అవుతున్నారు.

ఇతర నేరాల విషయంలో జెండర్ వివక్ష లేనప్పుడు ఈ నేరం విషయంలోనూ మహిళలను వేరుగా చూడాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కేరళకు చెందిన సామాజిక కార్యకర్త జోసెఫ్ షైన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Whether women can be punished for adultery in India will be decided by a five-judge constitution bench of the Supreme Court.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి