పొలంలో మూత్రించాడని, పురుషాంగాన్ని కోసేశాడు

5-year-old's penis chopped off in UP
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో పొలం మూత్రం పోశాడనే కోపంతో ఐదేళ్ల బాలుడి పురుషాంగాన్ని పొలం యజమాని కోసేశాడు. బుధవారంనాడు పోలీసులు ఆ విషయం చెప్పారు. ప్రతాప్‌గఢ్‌లోని కొరాలి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.

ఇటుకల బట్టీ కార్మికుడు శేషారాం కుమారుడు రీతేష్ పొలంలో తిరుగుతూ మూత్రం పోస్తున్నప్పుడు దొరికిపోయాడు. ఆ బాలుడిని పొలం యజమాని కొట్టడమే కాకుండా అతని పురుషాంగాన్ని కోసేశాడు. రక్తం ఓడుతూ బాలుడు ఏదో విధంగా ఇంటికి చేరుకున్నాడు.

బాలుడిని అలహాబాద్ ఆస్పత్రిలో చేర్చారు. అతనికి చికిత్స జరుగుతోంది. పొలం యజమాని దుర్గేష్ మౌర్యపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో మౌర్య కుమారుడిని కూడా నిందితుడిగా చేర్చాడు.

నిందితులు పరారీలో ఉన్నట్లు, వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలపై వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా బాలుడిపై ఈ దాడి ఘటన వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+