Demonetisation: సరిగ్గా అయిదేళ్ల కిందట..ప్రధాని మోడీ నోట ఆ మాట: విఫల ప్రయోగంగా

న్యూఢిల్లీ: సరిగ్గా అయిదేళ్ల కిందట.. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అది. దేశ ప్రజలను నిర్ఘాంత పరిచిన నిర్ణయం అది. కోట్లాదిమందిని బ్యాంకులకు పరుగులు పెట్టించిన ప్రకటన అది. రోజుల తరబడి ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చోబెట్టిన ప్రయోగం అది. ప్రధాని చేసిన ఆ ఒక్క ప్రకటన ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో ఆ ప్రయోగం సాధ్యపడుతుందా? అనే సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి అప్పట్లో.

పెద్ద నోట్ల రద్దు ఓ సంచలనం

ఆ ప్రకటనే- పెద్ద నోట్ల రద్దు. అప్పటిదాకా మనుగడలో ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ఇకపై చిత్తు కాగితంతో సమానం అంటూ మోడీ చేసిన ఆ ప్రకటనకు అయిదేళ్లు. 2016 నవంబర్ 8వ తేదీ నాటి సాయంత్రం దేశ ప్రజల ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారు. పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. నల్ల ధనాన్ని వెలికి తీయడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి- ప్రత్యేకించి.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారాయన.

రూ.1,000కి బదులుగా రూ.2,000

వెయ్యి రూపాయల కరెన్సీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దాని స్థానంలో 2,000 రూపాయల నోటును చలామణిలోకి తీసుకొచ్చింది. పాత 500 రూపాయలకు బదులుగా.. మరో నోటును ప్రవేశపెట్టింది. అన్ని డినామినేషన్ల నోట్లను కూడా సమూలంగా మార్చివేసింది. ఆ తరువాత 2,000 రూపాయల నోట్లు ముద్రణను నిలిపివేసింది రిజర్వుబ్యాంక్. ఆ నోటు చలామణిలో ఉన్నప్పటికీ.. కొత్త నోట్లను ప్రింట్ చేయట్లేదు.

కేంద్రం లక్ష్యం నెరవేరిందా?

పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల మోడీ సర్కార్ లక్ష్యం నెరవేరిందా? అంటే లేదనే అంటున్నారు ఆర్థిక వేత్తలు. దేశంలో నల్లధనం లేదు అనే విషయం ఈ రద్దు వ్యవహారం తేల్చి చెప్పింది. చలామణిలో ఉన్న నగదు కరెన్సీలో 98 నుంచి 99 శాతం తమకు అందాయని అప్పట్లో రిజర్వుబ్యాంక్ ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయా? అంటే అదీ లేదు. పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. 2019 నాటి పుల్వామా ఉగ్రదాడి దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు.

నగదు లావాదేవీలు రెట్టింపు..

ఇక నగదు లావాదేవీలు మూడింతలు అయ్యాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్ వాటా చాలా పరిమితంగా ఉంటోందని రిజర్వుబ్యాంక్ లెక్కలు తేల్చి చెబుతున్నాయి. కిందటి నెల 8వ తేదీ నాటికి దేశ ప్రజల వద్ద ఉన్న నగదు మొత్తం 28.30 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ధారించింది రిజర్వుబ్యాంక్. ఈ స్థాయిలో నగదు నిల్వలు అనేవి ఎప్పుడూ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. 2016 నవంబర్ 4వ తేదీన నమోదైన నగదు లావాదేవీలు 17.97 లక్షల కోట్ల రూపాయలు కాగా.. ఈ అయిదేళ్ల వ్యవధిలో ఈ సంఖ్య 28.30 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది.

గత ఏడాదితో పోల్చుకున్నా ఎక్కువే..

గత ఏడాది అక్టోబర్ 23వ తేదీ నాటికి ముగిసిన దీపావళి పండగ సీజన్‌లో 15,582 కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలు చోటు చేసకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 8.5 శాతం మేర పెరిగింది. 2.21 లక్షల కోట్లకు చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన గత సంవత్సరం కొంత మేర మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయని రిజర్వుబ్యాంక్ తెలిపింది. కరోనా వైరస్ భయంతో ప్రజలు ఏటీఎంలకు వెళ్లకపోవడం వల్ల యాప్‌ల ద్వారా చెల్లింపులపై ఆధారపడ్డారని, ఫలితంగా కొంతమేర పెరిగిందని పేర్కొంది.

Recommended Video

    Morning News Roundup 29/03/2019

    దేశ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌డేగా..

    పెద్ద నోట్లను రద్దు చేసి అయిదేళ్లయిన సందర్భంగా ఈ నవంబర్ 8వ తేదీని బ్లాక్‌డేగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. #Black_Day_Indian_Economy అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తోన్నారు. అదొక విఫల ప్రయోగమని వ్యాఖ్యానిస్తున్నారు. తమ అభిప్రాయాలను మీమ్స్ ద్వారా తెలియజేస్తున్నారు. దేశ ప్రజలను ఇక్కట్లపాలు చేసిందని, ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరేలా చేసిందని అంటున్నారు. దీనిద్వారా ఆర్థికవ్యవస్థకు ఎలాంటి మేలు కలగలేదని తేల్చి చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+