చైనా పీసులకు గ్యారంటీ..వారంటీ ఉండదనే టాక్..మళ్లీ ప్రూవ్: భారత్‌కు పంపిన 50 వేల పీపీఈ కిట్స్ ఫెయిల్

న్యూఢిల్లీ: చైనా పీసులకు గ్యారంటీ ఉండదనేది పబ్లిక్ టాక్. చైనా తయారు చేసిన అత్యధిక వస్తువులు, ఇతర పరికరాలు సరిగ్గా పనిచేయవనే విషయం సగటు భారతీయుడికీ తెలుసు. ఇప్పుడా విషయం మరోసారి నిరూపితమైంది. చైనా మన దేశానికి ఎగుమతి చేసిన వైద్య పరికరాల్లో 50 వేల వరకు పనికి రావని తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఆర్‌డీఓ) నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఈ విషయం వెల్లడైంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నివారించానికి లక్షలాది మంది డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లు, మెడికల్ స్టాఫ్‌ అవసరాల కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)లను పంపించింది చైనా. లక్షా 70 వేలకు పైగా పీపీఈ కిట్లను షాంఘై, హాంకాంగ్‌ల నుంచి వాటిని తెప్పించారు. ఎయిరిండియా, స్పైస్‌జెట్ సంస్థలకు చెందిన సరుకుల వాహక విమానాల ద్వారా వాటిని భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాలకు పంపించారు.. తెలంగాణ సహా.

50,000 PPE kits from China fail quality tests in India

ఈ పీపీఈ క్విట్లకు వైద్య పరీక్షలను నిర్వహించిన తరువాతే వినియోగానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఐసీఎంఆర్ సహా మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని డీఆర్‌డీఓల్లో పరీక్షలను నిర్వహించారు. భారత్‌కు అందిన పీపీఈల్లో 50 వేల కిట్స్ మనదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రమాణాలను అందుకోలేదు. వైద్య పరీక్షల సందర్భంగా.. అవన్నీ పనికి రావని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా కిట్స్‌ను ఎవరూ వాడుకోవద్దని ఆదేశాలను జారీ చేశారు.

మనదేశానికి సరఫరా అయ్యే పీపీఈ కిట్స్‌లల్లో చైనా వాటా అధికం. ఎక్కువగా ఆ దేశం నుంచే భారత్‌కు అందుతుంటాయి. తాజాగా పంపించిన కిట్స్‌లల్లో 50 వేల వరకు ఉపయోగపడనివేనంటూ అధికారులు తేల్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో పీపీఈ కిట్స్ కొరత క్రమంగా ఏర్పడుతోందని, దీన్ని అధిగమించడానికి విరాళంగా అవి మనకు అందాయని అధికారులు చెబుతున్నారు. 50 వేల పీపీఈలు నాణ్యమైనవి కాకపోవడంతో ఇక దేశీయంగా వాటి తయారీని ముమ్మరం చేశామని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+