కరోనా కేసుల కల్లోలం - మాస్కు తప్పనిసరి..!!
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,357 కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరుకుంది. వైరస్ కు మరో 11 మంది బలయ్యారు. ఇదే సమయంలో కేంద్రం అలర్ట్ అయింది. ఇటు మూడు రాష్ట్రాల్లో తిరిగి మాస్కు వినియోగం తప్పనిసరి చేసారు.
కరోనా కేసులు నిన్నిటి రోజున కొంత మేర తగ్గినా తీవ్రత కొనసాగుతోంది. మరణాల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. గుజరాత్‌లో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణాలు నమోదు అయ్యాయి.

ప్రస్తుతం డేలీ పాజిటివిటీ రేటు 3.39% గా, కవరీ రేటు 98.74 శాతంగా ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్నీ రాష్ట్రాలకు సూచించింది.
కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సర్వత్రా ఆందోళ మొదలైంది. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నిర్దేశించింది.
వివిధ ఆసుపత్రుల మౌలికవసతుల సంసిద్దతలో భాగంగా.. సోమ, మంగళవారాలు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఇప్పటికే స్పష్టం చేసింది. కొవిడ్ హాట్‌స్పాట్ కేంద్రాలను గుర్తించి నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించింది. హర్యాణాలో బహిరంగా ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసారు.
గర్భిణులు, వృద్ధులు, రోగాలు ఉన్న వారు కచ్చితంగా మాస్కులు ధరిచాలన్న నిబంధనను కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బహిరంగ ప్రదేశాల్లోకి వెళితే ప్రజలు కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని పుదుచ్చేరి ప్రభుత్వం తేల్చిచెప్పింది.
విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో కొవిడ్ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే మాస్క్ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications