వైఎస్ జగన్ బాటలో నెచ్చెలి శశికళ: ఓదార్పు యాత్ర

వైఎస్ జగన్ బాటలో శశికళ ఓదార్పు యాత్ర చెయ్యడానికి సిద్దం అయ్యారు. జయలలిత మరణాన్ని తట్టుకోలేక తమిళనాడులో 597 మంది మృతి చెందారు.

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నెచ్చెలి శశికళ నటరాజన్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను ఆమె సన్నిహితులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణాన్ని చూసి తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి శశికళ సిద్దం అయ్యారు. జయలలిత మరణించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 597 మందికిపైగా మరణించారు.

అమ్మ మీద అభిమానంతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి అన్నాడీఎంకే చీఫ్ శశికళ ఇప్పుడు సిద్దం అయ్యారు. శశికళ ఓదార్పు యాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ కుటుంబాలకు పార్టీ నుంచి అందించాల్సిన సాయం చెక్కులను శశికళ స్వయంగా పంపిణి చెయ్యనున్నారు.

597 people died unable to bear demise of J Jayalalithaa, AIADMK says

మొత్తం మీద అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు దగ్గర కావడానికి సిద్దం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ఆయన కుమారుడు జగన్ సుడిగాలి పర్యటన (ఓదార్పు యాత్ర) చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ బాటలోనే శశికళ కూడా ఓదార్పు యాత్ర చేపట్టడానికి తమిళనాడులో సుడిగాలి పర్యటన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+