చేతబడి: ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య

ఒడిశా: క్షుద్ర విద్యలతో చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలోని ఆరుగురిని అతి దారుణంగా కొట్టి చంపేసిన సంఘటన ఒడిశాలో జరిగింది. మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా అందరిని కిరాతంగా హత్య చేశారు.

సీనియర్ పోలీసు అధికారి అజయ్ ప్రతాప్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఒడిశాలోని లహందా అనే గిరిజన గ్రామంలో ఒక కుటుంబం నివాసం ఉంటున్నది. ఈ కుటుంబ పెద్దతో పాటు కుటుంబ సభ్యులు చేతబడులు చేస్తున్నారని గ్రామస్తులు అనుమానం పెంచుకున్నారు.

అందువలనే నిత్యం గ్రామంలో చాలామంది అనారోగ్యానికి గురై మరణిస్తున్నారని అనుమానం పెంచుకున్నారు. ఆ కుటుంబం మీద కక్ష పెంచుకున్నారు. ఆదివారం రాత్రి గ్రామస్తులు ఆ కుటుంబ సభ్యుల మీద దాడులకు పాల్పడ్డారు.

6 Family Members killed in Odisha

కుటుంబంలోని 8 మంది మీద పదునైన కత్తులు, పెద్దపెద్ద కర్రలతో దాడులు చేశారు. ఈ దాడిలో మహిళ, నలుగురు పిల్లలతో సహ ఆరుగురు సంఘటనా స్థలంలో మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఇద్దరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.

పోలీసులు ఆరుగురి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చెయ్యాలని డీజీపీ ఆదేశాలు జారీ చెయ్యడంతో గ్రామంలోని పురుషులు అందరూ పరారైనారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అదే విధంగా రాయ్ గడ్ జిల్లాలోని దలిత గ్రామంలో నివాసం ఉంటున్న జగన్ బంధు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని అనుమానంతో అతని మీద తీవ్రంగా దాడి చేసి అతను బ్రతికి ఉన్నట్లే సజీవదహనం చేశారు. చేతబడి చేసే వారికి ఇదే పరిస్థితి అని గ్రామస్తులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+