6 పెళ్లిళ్లు, సామూహిక వివాహంలో చెయ్యివాటం, చేసేది పోలీసు ఉద్యోగం, భార్య రివర్స్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఒకటి, రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం నేరం అంటారు. చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు ఏకంగా 6 పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు రచ్చకెక్కారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ పోలీసు మహిళలను లక్షంగా చేసుకుని పెళ్లిళ్లు చేసుకుని జల్సా చేస్తున్నాడు.

20 ఏళ్ల క్రితం

20 ఏళ్ల క్రితం

కర్ణాటకలోని హుబ్బళికి చెందిన శివకుమార్ 20 ఏళ్ల క్రితం మహానందా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఐదు సంవత్సరాలు ఆమెతో సవ్యంగా సంసారం చేసిన శివకుమార్ ముగ్గురు బిడ్డలకు తండ్రి అయ్యాడు. తరువాత భార్య మహానందాకు మొఖం చేటేశాడు.

సామూహిక వివాహాలు

సామూహిక వివాహాలు

2009లో యలబుర్గిలో జరిగిన సామూహిక వివాహాల సందర్బంగా శాంతా అనే మహిళను శివకుమార్ వివాహం చేసుకున్నాడు. ఆమెతో కొంత కాలం కాపురం చేశాడు. తరువాత రెండో భార్య శాంతా చేదు కావడంతో మూడో పెళ్లి కోసం ప్రయత్నించాడు.

నిత్యపెళ్లి కొడుకు

నిత్యపెళ్లి కొడుకు

శాంతాను వివాహం చేసుకున్న తరువాత పోలీసు ఉద్యోగం అడ్డుపెట్టుకున్న శివకుమార్ అనంతరం భాస్కరమ్మ, సలీమా, లక్ష్మి అలియాస్ లక్ష్మవ్వ, మంజులను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం అందర్నీ వదిలేసి మంజులతో సంసారం చేస్తున్నాడు.

హుబ్బళిలో ఉద్యోగం

హుబ్బళిలో ఉద్యోగం

ఆరు మందిని పెళ్లి చేసుకున్న శివకుమార్ ప్రస్తుతం హుబ్బళి ఉత్తర ట్రాఫిక్ విభాగంలో పోలీసుగా ఉద్యోగం చేస్తున్నాడు. అప్పట్లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా పనిచేసిన శంకర బిదరికి తన భర్త గురించి ఫిర్యాదు చేశానని శివకుమార్ మొదటి భార్య చెప్పింది.

బెంగళూరు హాస్టల్ లో పిల్లలు

బెంగళూరు హాస్టల్ లో పిల్లలు

శంకర బిదరి ఆదేశించినా హుబ్బళి పోలీసులు శివకుమార్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని మొదటి భార్య మహానందా ఆరోపించారు. చివరికి మా బాధ అర్థం చేసుకున్న శంకర బిదరి బెంగళూరులోని ఓ హాస్టల్ లో తన ఇద్దరి కుమారులను చదివిస్తున్నారని మహానందా విలపిస్తున్నారు.

ఆరు పెళ్లిళ్లు, ప్రభుత్వ ఉద్యోగం

ఆరు పెళ్లిళ్లు, ప్రభుత్వ ఉద్యోగం

ఆరు మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిన తన భర్త శివకుమార్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మహానందా హుబ్బళి-దారవాడ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకుండా చూడాలని, ఇలాగే శివకుమార్ ను వదిలేస్తే అతను ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటాడో తెలియదని మహానందా అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
6 Marriage issue allegation on police constable in Hubballi in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి