కంటైనర్ వచ్చి వోల్వో కారు మీద పడితే ఎట్టా ఉంటాదో తెలుసా?

Bengaluru: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉండటం విషాదాన్ని నింపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.

బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారి నంబర్ 48పై ఈ ఉదయం 11 గంటల సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. మృతులను చంద్ర యాగప్ప గోళ్ (48), గౌరా బాయి (42), దీక్షా (12), జాన్ (16), విజయలక్ష్మి (36), ఆర్య (6)గా గుర్తించారు. మృతులందరూ మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాకు చెందిన వాళ్లు.

6 persons including 2 children of family travelling in an SUV died in accident in Bengaluru

ఉద్యోగ రీత్యా చంద్ర యాగప్ప కుటుంబం విజయపురలో స్థిరపడింది. క్రిస్మస్, జనవరి సెలవులు రావడంతో ఆయన కుటుంబం బెంగళూరును సందర్శించడానికి వొల్వో కారు (నంబర్ కేఏ 01 1536)లో బయలుదేరింది. తుమకూరు- బెంగళూరు మార్గమధ్యలో నెలమంగళ సమీపంలోని టీ బేగూరుకు చేరిన తరువాత ప్రమాదానికి గురైంది.

ఓ భారీ కంటైనర్ అదుపు తప్పి వాళ్లు ప్రయాణిస్తోన్న కారుపై పడింది. హెవీ కంటైనర్ అది. కంటైనర్ పడిన వెంటనే కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తోన్న ఆరుమందీ సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వెళ్తోన్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని) పాల కంటైనర్‌ను ఢీ కొనడం వల్లే ఇది అదుపు తప్పింది.

6 persons including 2 children of family travelling in an SUV died in accident in Bengaluru

దురదృష్టవశావత్తూ అదే సమయంలో వొల్వో కారు వెళ్తోండటంతో దానిపై పడింది. కంటైనర్ మొత్తం కారుపై ఒరిగింది. చంద్రప్ప ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఈ కారును కొన్నట్లు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆధారంగా పోలీసులు వెల్లడించారు. కంటైనర్‌ను తొలగించడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీనికోసం ఓ భారీ క్రేన్ తెప్పించారు.

కారులో ఇరుక్కున్న మృతదేహాలను తొలగించడానికి గ్యాస్ కట్టర్లను వినియోగించారు. సమాచారం అందిన వెంటనే నెలమంగళ పోలీసులు, బెంగళూరు రూరల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సీకే బాబా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనతో జాతీయ రహదారి కావడం వల్ల దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+