ఈ వయస్సులో ఏం పోయేకాలం: భార్యను చంపేశాడు

న్యూఢిల్లీ: మరో వ్యక్తితో తన భార్య చనువుగా ఉంటుందని తట్టుకోలేని వ్యక్తి ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. మంజు మోంగా (58) ను ఆమె భర్త ముఖేష్ మోంగా (60) అతి దారుణంగా కత్తితో పోడిచి హత్య చేశాడు. పోలీసులు చేజ్ చేసి ముఖేష్ ను అరెస్టు చేశారు.

ముఖేష్, మంజుకు 30 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు, కుమార్తె తూర్పు ఢిల్లీలోని హరినగర్ లో నివాసం ఉంటున్నారు. బుధవారం ముఖేష్ భార్య మంజుతో కలిసి కారులో బయలుదేరాడు.

మార్గం మధ్యలో దక్షిణ ఢిల్లీలోని ఆనందనీకేతన్ ప్రాంతంలో మంజు మొబైల్ కు ఎవరో ఫోన్ చేశారు. మంజు చాల సేపు ఫోన్ లో మాట్లాడుతుంది. ఆ సమయంలో ముఖేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే మంజు మాట్లాడూతునే ఉన్నారు.

60-year-old stabs wife to death in car in New Delhi

సహనం కోల్పోయిన ముఖేష్ కత్తి తీసుకుని భార్య మంజును కసితీరా పోడిచి కారులోనే దారుణంగా హత్య చేశాడు. తరువాత కారు దిగి అక్కడి నుంచి పారిపోవడానికి పరుగు తీశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఛేజ్ చేసి ముఖేష్ ను అరెస్టు చేశారు.

ముఖేష్ తాగుడుకు బానిస అయ్యాడని, నిత్యం భార్యను వేధించేవాడని పొరుగింటి వారు సమాచారం ఇచ్చారని పోలీసులు అన్నారు. మరో వ్యక్తితో చనువుగా ఉంటున్న మంజు తన ముందే అతడితో ఫోన్ లో మాట్లాడుతుండటం తట్టుకోలేక హత్య చేశానని ముఖేష్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+