102 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల తయారీ
2019 ఫిబ్రవరిలో ఢిల్లీ- వారణాసి మధ్య తొలి వందే భారత్ ప్రారంభమైంది.
మనదేశంలో తయారైన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంలో ఉన్నవారికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వందేభారత్ నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో మరొకటి అందుబాటులోకి రాబోతోంది.
2024 సంవత్సరం చివరకు దేశం మొత్తం మీద 67 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. ప్రస్తుతం ఇవి అభివృద్ధి దశలో ఉన్నాయని లోక్ సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం 102 వందే భారత్ రైళ్ల తయారీకి సంబంధించిన ప్రణాళికను మంత్రి వివరించారు.

2019 ఫిబ్రవరిలో ఢిల్లీ- వారణాసి మధ్య తొలి వందే భారత్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రూట్లలో వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 35 రైళ్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 67 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించబోతున్నారు. పీహెచ్-21 రోలింగ్ స్టాక్ ప్రోగ్రామ్ కింద వీటి తయారీని భారతీయ రైల్వే చేపట్టింది. రూ.19,479 కోట్ల నిధులను మంజూరు చేసింది. కోచ్ లతోపాటు వాటికి సంబంధించిన సామగ్రిని కూడా సమకూర్చాల్సి ఉంటుంది.
సిట్టింగ్ కింద చైర్ కార్ వెర్షన్ లో 75 వందేభారత్ లు బయటకు రానున్నాయి. మిగిలినవన్నీ స్లీపర్లే ఉంటాయి. వీటికి అదనంగా మరో 400 స్లీపర్ వెర్షన్ వందేభారత్ రైళ్లను తయారుచేయడానికి టెండర్లను అధికారులు ఆహ్వానించారు. 8వేల కోచ్ లు తయారుచేయాలని 2023-24 బడ్జెట్ లో ప్రతిపాదన చేశారు.
మొత్తంగా చైర్ కార్ వెర్షన్‌లో 75 వందేభారత్ రైళ్లను ఉత్పత్తి చేయనున్నారు.

ఇక, మిగతా రైళ్లను స్లీపర్ వెర్షన్‌లుగా తీర్చి దిద్దనున్నారు. అదనంగా మరో 400 స్లీపర్ వెర్షన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయడానికి టెండర్లను భారతీయ రైల్వే ఆహ్వానించింది. దేశంలోని ఇండియన్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్లలో సిబ్బందితో కలిసి పనిచేసే సంస్థలకు ఈ అవకాశం ఇవ్వనుంది. ఇవే కాకుండా 8000 వందేభారత్ రైల్ కోచ్‌ల తయారీకి 2023-24 బడ్జెట్‌లో ప్రతిపాదన చేశారు.
ప్రస్తుతం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలు ఇండియన్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్లుగా ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 1455 కిలోమీటర్ల రైలు మార్గాన్ని కవచ్ తో అనుసంధానం చేశారు. ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-హౌరా రైలు మార్గంలోను 3వేల కిలోమీటర్ల దూరాన్ని కవచ్ కిందకు తీసుకురావడానికి టెండర్లను పిలవబోతున్నారు. ఎదురెదురుగా రైళ్లు వచ్చినప్పుడు ఢీకొట్టుకోకుండా లోకో పైలెట్లను హెచ్చరించే వ్యవస్థే కవచ్.












Click it and Unblock the Notifications