ఘోర ప్రమాదం: ఏడుగురు చిన్నారులు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

గాంధీనగర్‌: గుజరాత్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతి చెందిన పిల్లలంతా ఏడు నుంచి పదహారేళ్ల మధ్య వయసువారే. ఈ ప్రమాదం గుజరాత్‌లోని పంచమహల్‌లో చోటుచేసుకుంది. సమాచారం​ అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి వాహనం నుంచి మరో ముగ్గురిని రక్షించారు.

7 children of family killed in car accident in Gujarat

తీవ్రంగా గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కారును నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+