పట్టపగలే కొట్టేశారు.. ఐటీ అధికారులమని చెప్పి రూ. 7 కోట్లతో జంప్..
బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఐటీ, ఆర్బీఐ అధికారులమని చెప్పి ఏటీఎం క్యాష్ వాహనం నుంచి రూ. 7 కోట్లతో పరార్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయులో దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు.. ఐటీ, ఆర్బీఐ అధికారులుగా నటించి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు ఎస్ యూవీ వాహనంలో ఏటీఎం క్యాష్ వాహనాన్ని వెంబడించినట్లు స్పష్టం చేశారు.
దొంగలు మితిమీరి పోతున్నారు. పెద్ద పెద్ద నగరాలు, ఏటీఎంలు, బ్యాంకులే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులోని జేపీ నగర్ లో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. పన్ను అధికారులు, ఆర్బీఐ అధికారులమని మాయ మాటలు చెప్పి ప్రభుత్వ వాహనంలో వచ్చి ఏటీఎం వాహనంలో దూరారు. క్యాష్ కు సంబంధించిన పత్రాలు చూపించాలని హడావుడి చేశారు. వాళ్లు స్పందించే సరికే డబ్బును కారులోకి బలవంతంగా ఎక్కించారు. అలా కొంత దూరం కారులో వెళ్లాక.. ఆ సిబ్బందిని బలవంతంగా దింపేసి ఆ డబ్బుతో అక్కడికి జంప్ అయ్యారు.

ఘటనాస్థలికి చేరుకున్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగులను పట్టుకునే క్రమంలో ఉన్నారు. సీసీటీవీ ఫూటేజ్, డ్రైవర్ సమాచారం.. ప్రకారం ఈ దుండగుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీలైనంత త్వరలో వాళ్లను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గతంలో కర్ణాటకలోని విజయపురిలోనూ ఎస్బీఐ బ్యాంక్ శాఖకు మాస్కులు ధరించి వచ్చిన దుండగులు భారీగా నగదు, ఆభరణాలను దోచుకున్నారు. 50 కేజీల బంగారం, రూ.8 కోట్ల నగదు చోరీ చేశారు.












Click it and Unblock the Notifications