ముగిసిన దీపావళి సంబరాలు... ఆ గ్రామంలో అంతేమరి!

‘ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టెది ఇంకో దారి’ అనే సామెతను నిజం చేశారు ఈ గ్రామస్థులు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఈనెల 19న దీపావళి వేడుకలు జరుపుకోనుండగా.. ఈ గ్రామ ప్రజలు ఇప్పటికే దీపావళి వేడుకలను ముగించేశా

రాయపూర్: 'ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టెది ఇంకో దారి' అనే సామెతను నిజం చేశారు ఈ గ్రామస్థులు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఈనెల 19న దీపావళి వేడుకలు జరుపుకోనుండగా.. ఈ గ్రామ ప్రజలు ఇప్పటికే దీపావళి వేడుకలను ముగించేశారు.

అరె.. వాళ్లెవరండీ బాబూ.. అనుకుంటున్నారా? మీరే చదవండి మరి. ఛత్తీస్‌గఢ్ లోని ఖుర్దా బ్లాక్‌కు చెందిన సెమ్రాసీ గ్రామస్థులు ఈనెల 12నే అత్యంత వైభవంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

7 days ago, it seems to be Diwali, this is the reason

దీపావళి పండుగ ఒక్కటే కాదు. వీరు హోలీతో పాటు మరికొన్ని పండుగలను కూడా దేశ ప్రజలందరి కంటే ఓ వారం రోజుల ముందుగానే చేసుకుంటూ ఉంటారు. ఎందుకిలా? అంటే ఆ గ్రామపెద్ద పలు విషయాలు వెల్లడించారు.

ఈ ఆచారం సెమ్రాసీ గ్రామంలో ఎప్పటినుంచో వస్తోందట. నాలుగు ముఖ్యమైన పండుగలను వారం రోజుల ముందుగానే నిర్వహిస్తుంటారట. 1500 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో ఈ ఆచారాన్ని ఎవరూ అతిక్రమించకపోవడం విశేషం. గ్రామదేవత ఆశీస్సులు పొందేందుకే వీరు ఇలా చేస్తుంటారట!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+