వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.6800 కోట్ల ఆదాయం, 7 లక్షల మందికి ఉపాధి: యూట్యూబ్ చీఫ్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా యూట్యూబ్.. అవును దేశంలో ఏ భాషలోనైనా సరే యూట్యూబ్‌కు ఆదరణ ఉంటుంది. రకరకాల వీడియోలు చేస్తున్నారు. లైఫ్ స్టైల్, గాడ్జెట్స్, ఆటో మొబైల్, ఫుడ్ ఐటెమ్స్, హౌస్ డెకరేషన్.. సారీస్ హోమ్, ట్రావెల్.. ఒకటెంటి.. అన్నింటిని వీడియో చేస్తున్నారు. యూజర్లు కూడా అన్నింటినీ చూస్తున్నారు. దీంతో ఇండియాలో రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది.

దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో 7 లక్షల మందికి ఉపాధి కూడా లభించింది. 2022 సైఫై కార్యక్రమాన్ని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, గూగుల్ ఎస్వీపీ నీల్ మోహన్ పాల్గొన్నారు.

యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తున్న వారు ఎక్కువ మంది ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. దీంతో వారికి ఆదాయం కూడా సమకూరుతుంది. ఇందులో చిన్న బిజినెస్ అని..ప్రకటనల ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుందని నీల్ మోహన్ వివరించారు. దేశంలో అన్ని భాషల్లో చేస్తోన్న వీడియోలు సక్సెస్ అవుతున్నాయి. కంటెంట్ క్రియేటర్లకు, యూజర్లకు మంచి ప్లాట్ ఫామ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో కంటెంట్ ప్రొవైడర్లకు మంచి స్థానం ఉందని, ఎప్పుడూ కొత్త వారు వస్తుంటారని వివరించారు.

7 lakh jobs, Rs 6,800 crores on YouTube

యూట్యూబ్ వీడియోలు చాలా ట్రోల్ అవుతాయని తెలిపారు. క్రియేటర్లు చేసినవి ప్రభుత్వాల వరకు కూడా వెళతాయని తెలిపారు. వాటిని ప్రభుత్వాలు కూడా పట్టించుకొని.. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయని అంటున్నారు. తప్పుడు సమాచారం చేరవేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని వివరించారు.

ఎన్నికలపై సమగ్రత, హింసను నివారించడం, తపుడు సమాచారం పట్ల తాము ఒక విధానంతో ముందుకు వెలతున్నామని తెలిపారు. తప్పుడు సమాచారం, ద్వేషాన్ని వేదికపై అనుమతించబోమని స్పష్టంచేశారు.

English summary
India’s creator economy is booming and local creators on YouTube are annually contributing an estimated Rs 6,800 crore to the country’s GDP and in the process generating 7 lakh jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X