యువతిపై ఏడుగురు గ్యాంగ్‌రేప్: సొషల్ సైట్లలో వీడియో, ఒకరి అరెస్ట్

మేవత్: హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఆ వీడియోను సొషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

కొద్ది నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన పోలీసులు, నిందితులలో ఒకర్ని గురువారం అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేవత్‌ మూలమలుపు వద్ద కొద్ది నెలల క్రితం ఓ యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన నిందితులు.. సొషల్ సైట్లలో అప్‌లోడ్ చేశారు.

7 men gang raped girl in Haryana, video goes viral, one held

కాగా, ఈ వీడియోను గుర్తించిన స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పోలీసులకు అందజేశాడు. వీడియో ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు, నిందితులలో ఒకర్ని అరెస్ట్ చేశారు. మిగితా ఆరుగురి కోసం గాలింపు చేపట్టారు.

ఆ వీడియోలో నేరానికి పాల్పడుతున్న ఆరుగురు యువకులు సిగ్గులేకుండా నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చారు. ఆ యువతిని అత్యాచారం చేసుకుంటూ రాక్షసానందాన్ని పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+