వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒప్పో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్.. మీ సొంతం చేసుకునేందుకు ఏడు అద్భుతమైన కారణాలు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో రెండ్రోజుల క్రితమే తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎఫ్7ను విడుదల చేసింది. దీని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇండస్ట్రియల్ డిజైన్ సంగతి పక్కన పెడితే, ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ల్‌ప్లే పైభాగాన ఐఫోన్ ఎక్స్ తరహాలో

నాచ్‌ను అమర్చడమేకాక, ఇందులో అత్యాధునిక సాంకేతికతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అప్లికేషన్లను కూడా పొందుపరిచింది.

ఇప్పటికే సెల్ఫీల విషయంలో ఒప్పో మొబైల్‌ఫోన్ రారాజుగా వెలుగొందుతోంది. తాజాగా విడుదలైన ఎఫ్7 మోడల్‌ ఫోన్‌ కూడా వినియోగదారులకు తిరుగులేని సెల్ఫీలను అందించనుంది. మరి, కొత్తగా విడుదలైన ఈ ఎఫ్7 స్మార్ట్‌ఫోన్ విశిష్టతలేమిటో, దీనిలోని ఫీచర్లు ఏమిటో మరింత లోతుగా చూద్దాం.

7 Reasons Why You Should Own the OPPO F7 Right Away

అసలు ఒప్పో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్‌ మీరెందుకు సొంతం చేసుకోవాలనే దానికి సంబంధించిన అద్భుతమైన ఓ 7 పాయింట్లు ఇక్కడ మీకోసమే ఇచ్చాం.. చూడండి!

1. ఏఐ-పవర్డ్ సెల్ఫీ కెమెరా: మొబైల్ మార్కెట్‌లోకి ప్రవేశించిన దగ్గర్నించి ఒప్పో ఒక సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచింది. 2017లో ఒప్పో తొలిసారిగా తన మొబైల్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానంతో కూడిన సెల్ఫీల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పరిజ్ఞానం కారణంగా ఈ ఫోన్ మరింత అందమైన, స్పష్టమైన సెల్ఫీలను ఇవ్వగలుగుతోంది.

ఇక తాజాగా విడుదల చేసిన ఎఫ్7 స్మార్ట్ ఫోన్‌ ముందుభాగాన అమర్చిన, రియల్ టైం హై డైనమిక్ రేంజ్(హెచ్‌డీఆర్) సాంకేతికత కలిగిన 25 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన కెమెరాతో ఈ సెల్ఫీల పరిజ్ఞానాన్ని ఒప్పో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. అన్నిటికంటే ఎక్కువగా ఇందులో అమర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ బ్యూటీ 2.0 సాంకేతికత సెల్ఫీలు దిగే సమయంలో గ్రూపులోని అబ్బాయిలు, అమ్మాయిల ముఖాలను గుర్తించి, వారి ముఖ కవళికలను విడివిడిగా మరింత స్పష్టంగా, అందంగా తీర్చిదిద్దగలుగుతుంది.

స్కిన్‌తోపాటు కళ్లు, వెంట్రుకలను సైతం మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌ తెలివిగా స్త్రీ, పురుషులను గుర్తిస్తుంది కూడా. అంతేకాదు, ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్‌లో ఉపయోగించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ యూజర్లు తమ ఫొటోలకు రెగ్యులర్‌గా చేసుకునే మార్పులను గుర్తించి, ఆటోమెటిక్‌గా తరువాత దిగే ఫొటోలకు కూడా అవే మార్పులను వర్తింపజేస్తుంది. మరి ఈ ఏఐ పరిజ్ఞానం స్మార్ట్‌ఫోన్ ప్రియులను మురిపించదంటారా?

7 Reasons Why You Should Own the OPPO F7 Right Away

2. సూపర్ ఫుల్ స్క్రీన్: సమకాలీన స్మార్ట్‌ఫోన్లలో ఒప్పో ఎఫ్7 అన్నింటికంటే ముందంజలో నిలుస్తుంది. ఒప్పో తన తాజా స్మార్ట్‌ఫోన్ ఎఫ్7లో మొబైల్ ఇండస్ట్రీలోనే తొలిసారిగా నాచ్ స్క్రీన్‌తోపాటు ఆధునీకరించబడిన 6.2 అంగుళాల ఫుల్ హెడెఫినిషన్(ఎఫ్‌హెచ్‌డి) ప్లస్ సూపర్ ఫుల్ స్క్రీన్‌లను అమర్చింది. చదివేప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు అత్యంత పెద్దదైన ఈ డిస్‌ప్లే స్క్రీన్ యూజర్లకు అరచేతిలోనే అవ్యక్తానుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం మార్కట్‌లోని ఫోన్లతో పోల్చుకుంటే ఈ ఒప్పో ఎఫ్7 ఫోన్ అత్యధికమైన 2280x1080 డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉంది.

3. ఏఐతో కూడిన పునర్నిర్వచించబడిన ఫొటో మేనేజ్‌మెంట్: ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్‌లో అమర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ రికగ్నిషన్.. సెల్ఫీలు, ఫొటోల్లోని ముఖాలు, స్థలాలు, బ్యాక్‌గ్రౌండ్ సీనరీ తదితరాలను దానంతట అదే గుర్తించి మీరు వెతుక్కునే పని లేకుండా ఫొటోలను వేర్వేరు అల్బ‌మ్స్‌గా రూపొందిస్తుంది. ఒక్క ఫొటోలు, సెల్ఫీల నిర్వహణలోనే కాకుండా ఈ ఏఐ టెక్నాలజీ మీకు నచ్చిన యాప్స్‌ను పెట్టుకునేందుకు వీలుగా మీ ఫోన్ డిస్‌ప్లేని రెండుగా విభజిస్తుంది. ఇంకా మీ ఫోన్‌లో మీకు వచ్చే మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌ను వడపోసి మీకు సంబంధించిన మీటింగులు, వాటి సమయాలు, మీ ప్రయాణాలు లేదా సినిమా టిక్కెట్లు, ఇంకా షాపింగ్ ఆర్డర్లు తదితరాలను గుర్తించి ఒక్ క్రమపద్ధతిలో అమర్చుతుుంది.

4. ఫొటోగ్రఫీకి సంబంధించిన ఫన్ ఫీచర్స్: ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ‌ఫోన్‌లో కొన్ని వినోదాత్మక ఫీచర్లు యూజర్ల ఫొటోల్లో మరింత అందంగా కనిపించేలా కృషి చేస్తాయి. ఇందులోని కవర్ షాట్ ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా సెల్ఫీకి సంబంధించిన కలర్, శాచురేషన్‌ వంటివి అడ్జెస్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్, దుస్తుల రంగులను ద్విగుణీకృతం చేయవచ్చు.

5. ప్రిసైజ్ ఇండస్ట్రియల్ డిజైన్: ఒప్పో తాజాగా విడుదల చేసిన ఎఫ్7 స్మార్ట్ ఫోన్ డిజైన్ రూపకల్పనలో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. భారతీయుల అభిరుచికి తగ్గట్లుగా ఎఫ్7 స్మార్ట్ ఫోన్ సోలార్ రెడ్, స్టార్రీ బ్లూ, మూన్‌లైట్ సిల్వర్ అనే మూడు వైవిధ్యమైన రంగుల్లో లభిస్తుంది.

7 Reasons Why You Should Own the OPPO F7 Right Away

6. అత్యంత ఆధునిక ఆపరేటింగ్ సిస్టం: ఒప్పో ఎఫ్7 స్మార్ట్ ఫోన్ 8.1 ఆండ్రాయిడ్ ఓరియో ఆధారిత లేటెస్ట్ కలర్ ఓఎస్ 5.0 ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ ఇంటర్ఫేస్ డిజైన్ కూడా మీ కళ్లను కట్టిపడేస్తుంది. ఇందులో ఉపయోగించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీ జస్ట్ 0.08 సెకన్ల వ్యవధిలోనే స్క్రీన్‌ను అన్‌లాక్ చేయడమేకాక, సేఫ్ బాక్స్ ఫంక్షన్ యాప్స్, ఫైల్స్‌ను నియంత్రిస్తుంది. అంతేకాదు, మీ ప్రైవేట్ మెసేజ్‌లపై థర్డ్ పార్టీ యాప్‌ల కన్ను పడకుండా చూస్తుంది. భలే కదూ!

7. తిరుగులేని హార్డ్‌వేర్: కేవలం సాప్ట్‌వేర్ విషయంలోనే కాదు, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ విషయంలోనూ ఒప్పో సమానమైన పరిశోధన, నైపుణ్యతను మేళవించింది. ఈ ఎఫ్7 ఫోన్ 64 బిట్ 4జిబి ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీనిలోని ట్రిపుల్ మెమరీ స్లాట్ ట్రే ఫోన్ మెమరీని 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇంకా ఇందులో 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉన్నాయి. ఇక ఫోన్‌లోని రెండు 4జి వీవోఎల్టీఈ కార్డు స్లాట్లు ఏకకాలంలో రెండు 4జి సిమ్‌ కార్డులను సపోర్ట్ చేస్తుంది. మరో మాటలో చెప్పలంటే ఒకవైపు మీరు 4జీ ఫోన్ కాల్ మాట్లడుతూనే మరోవైపు రెండో 4జి కనెక్షన్ ‌ద్వారా గేమింగ్‌ను ఆనందించవచ్చు.. పోలా, అదిరిపోలా?

చూశారుగా.. స్మార్ట్‌ఫోన్ల లోకంలో సెల్ఫీ రారాజుగా పేరుగాంచిన ఒప్పో తాజా స్మార్ట్‌పోన్ ఎఫ్7 ఫీచర్లు. ఈ ఫోన్ ‌గురించి ఇప్పటివరకు మీకేమైనా సందేహాలు ఉన్నా.. ఇది చదివాక అవన్నీ తీరిపోయి ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సీజన్‌లో ఎవరికైనా మీరు ఓ మాంఛి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేదా మీకు మీరే ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వదలచుకున్నా ఒప్పో ఎఫ్7 స్మార్ట్‌ ఫోన్‌ను మించింది లేదు.

మరి, ఇంకా ఆలోచనెందుకు? ఒప్పో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు కచ్చితంగా ఈ సీజన్‌లో ఓ మంచి ప్రయత్నమే అవుతుంది.

English summary
OPPO has unleashed its latest, power-packed flagship device, OPPO F7, on March 26, 2018, and we're all excited! Apart from its state-of-the-art industrial design, the new smartphone also sports a notch screen and comes equipped with a bunch of Artificial Intelligence (AI)-backed applications. And like always, OPPO has again pushed its boundaries to prove its worth as the smartphone industry's "selfie expert and leader". Let's dive deeper to find out the unique features of the new OPPO F7, and also what makes it the best "selfie camera" that has been hosted by a smartphone till date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X