వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో జేడీఎస్‌కు షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా.. నేడు కాంగ్రెస్ తీర్థం!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆదివారం వీరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినట్లు ఈ ఏడుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటించారు. ఆపైన శనివారం వీరు తమ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది.

7 Rebal JD-S MLAs in Karnataka Resign from Party, to Join Congress

జహీర్ అహ్మద్ ఖాన్, అఖండ శ్రీనివాస్‌ మూర్తి, చలువరాయ స్వామి, ఇక్బాల్ అన్సారీ, బాలకృష్ణ, రమేశ్ బండి సిద్దె గౌడ, భీమా నాయక్‌లు పార్టీకి రాజీనామా చేసినట్టు జేడీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్‌బాబు తెలిపారు.

2016 రాజ్యసభ ఎన్నికల్లో కూడా వీరంతా పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేశారు. దీంతో ఈ ఏడుగురిని జేడీఎస్ గతంలోనే సస్పెండ్ చేసింది.
తాజాగా శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా వీరంతా కాంగ్రెస్ మూడో అభ్యర్థి అయిన జీసీ చంద్రశేఖర్‌కు ఓటేశారు.

పార్టీకి రాజీనామా చేసిన వారిలో నలుగురు తమ సొంత నిర్ణయానుసారమే రాజీనామా చేసినట్టు పేర్కొనడంతో వారి రాజీనామాలు ఆమోదించినట్టు స్పీకర్ కేబీ కోలివడ్ తెలిపారు. ఆదివారం తామంతా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు నాగమంగళ ఎమ్మెల్యే చలువరాయ స్వామి తెలిపారు.

English summary
Seven Janata Dal-Secular (JD-S) lawmakers in Karnataka on Saturday resigned from the party, a day after saying they voted for the Congress candidate in the Rajya Sabha polls, and will join the Congress on Sunday. Legislators BZ Zaheer Ahmed Khan, R Akhanda Srinivas Murthy, N Chaluvaraya Swamy, Iqbal Ansari, HC Balakrishna, Ramesh Bandi Siddegowda and Bheema Naik have resigned from the party, JD-S state spokesman Ramesh Babu told IANS. These legislators, who were earlier suspended by the JD-S for defying the party's whip and cross-voting for Congress during the 2016 Rajya Sabha polls, claimed to have voted in favour of third Congress candidate GC Chandrasekhar on Friday. The seven legislators had also tendered their resignations to Assembly Speaker KB Koliwad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X