వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 శాతం మందిలో లక్షణాలు కనిపించలే: ఒమిక్రాన్ వేరియంట్ గురించి వైద్యారోగ్యశాఖ

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. కొత్త వేరియంట్ గురించి కొత్త విషయాలను సైంటిస్టులు చెబుతున్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కానీ తీవ్రత తక్కువేనని వివరించారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ గురించి కేంద్ర వైద్యారోగ్య శాఖ మరొ కొత్త విషయాన్ని తెలియజేసింది.

దేశంలో ఇప్పటివరకు 358 మందికి వైరస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 183 మందిని పరిశీలించారు. వారిలో 73 శాతం మంది విదేశాల నుంచి వచ్చిన వారు.. వీరిలో 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతుందని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. 91 శాతం మందికి వ్యాక్సిన్ వేశారని.. వీరిలో 61 శాతం మంది పురుషులు, 39 శాతం మహిళలు ఉన్నారని వివరించారు.

70% of Indias Omicron cases asymptomatic: Health Ministry

మధ్యప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. రేపటి నుంచి యూపీ స్టార్ట్ చేయనుంది. అన్నీ రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఎంపీ ముందడుగు వేసింది. యూపీ వేయబోతుంది. ఇటు ఒమిక్రాన్‌ నిలువరించడం బూస్టర్ డోసుతో సాధ్యం అని నిపుణులు తెలియజేశారు. ఇదీ కాస్త సానుకూల అంశంగా మారింది.

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మొత్తం 38కి చేరాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలోనూ ఒమిక్రాన్ గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. అతని ప్రైమరీ సెకండరీ కాంటాక్టులకు సెకండ్ చేశారు. అతని భార్య, తల్లికి కరోనా సోకింది. దీంతో వారి శాంపిల్స్ కూడా జినొమ్‌కు పంపించారు. గూడెం గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

English summary
73% of patients had a foreign travel history while 70% were found to be asymptomatic. As many as 91% are fully vaccinated. 61% male and 39% female patients
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X