72 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు.. తీవ్రమైన కేసులు: ఏడీఆర్ రిపోర్ట్
బీహర్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలో కొలువుదీరిన మంత్రివర్గంలో క్రిమినల్ కేసులు ఎక్కువ ఉన్న మంత్రులు ఉన్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది.

72 శాతం మందిపై కేసులు
32 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో 27 మంది (72శాతం) క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. 17 మంది మంత్రులు (53 శాతం) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆర్జేడీకి చెందిన 15 మంది మంత్రులు (88 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ పేర్కొంది. 11 మంది (65) అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆర్జేడీతో పోల్చుకుంటే జేడీయూకి చెందిన మంత్రులు కాస్త మెరుగ్గా ఉన్నారని రిపోర్ట్ తెలిపింది. జేడీయూ నుంచి మొత్తం 11 మంది మంత్రులు ఉండగా.. నలుగురు మాత్రమే క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఇద్దరు మంత్రులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారని తెలిసింది.

వారెంట్ జారీ
2014లో కిడ్నాప్ కేసులో మంత్రి కార్తికేయపై బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. కేసులో మొత్తం 16కి భాగస్వామ్యం ఉందని ఎఫ్ఐఆర్‌లో రాశారు. మంత్రి కార్తికేయ, ఎమ్మెల్యే అనంత్ సింగ్ పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో ఆగస్టు 16నే దనపూర్ కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. అదే రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

డుమ్మా
మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి డాక్టర్ సంజీవ్ కుమార్, పంకజ్ కుమార్ మిశ్రా, సుదర్శన్ కుమార్, రాజ్కుమార్ సింగ్, షాలిని మిశ్రా మాత్రం ప్రమాణ స్వీకారానికి రాలేదు. వీరంతా మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఆర్జేడీతో చేతులు కలపడం కూడా వీరికి నచ్చలేదని సమాచారం. జేడీయూలో అసమ్మతి పెరిగితే వారంతా బీజేపీ వైపే వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications