Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

75th Republic Day 2024 LIVE Updates: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర శోభ..!

2024 జనవరి 26న భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి రావడంతో ఇక అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నాం.ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర శోభ కనిపిస్తోంది.అన్ని ప్రధాన రహదారులు చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి.ఇక త్రివిధ దళాలు చేసే విన్యాసాలు, పరేడ్లు చేసే ప్రాంతం కర్తవ్యపథ్ అత్యంత సుందరంగా ముస్తాబైంది.

ఈ 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ వస్తున్నారు. ఈ సారి ఫ్రెంచ్ రెజిమెంట్‌ కూడా పరేడ్‌లో పాల్గొననుండటం మరో విశేషం. ఇలా ఫ్రెంచ్ రెజిమెంట్ పరేడ్‌లో పాల్గొనడం ఇది రెండవసారి. ఉదయం 9:30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.

75th Republic Day 2024 celebrations Flag Hoisting parade live updates

అనంతరం పరేడ్ కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ తమిళసై త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తారు. దేశ రాజధాని ఢిల్లీ, విజవాడ, హైదరాబాద్‌లలో జరిగే గణతంత్ర వేడుకలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Jan 26, 2024, 12:47 pm IST
ఢిల్లీ

ముగిసిన గణతంత్ర దినోత్సవ వేడుకలు, రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.
Jan 26, 2024, 11:51 am IST
ఒడిషా

ఒడిషాలో మహిళా సాధికారత, చేతివృత్తులు, హ్యాండ్లూమ్‌లకు ప్రసిద్ధి అని చెబుతూ ప్రదర్శించిన శకటం
Jan 26, 2024, 11:49 am IST
హర్యానా

శ్రీరాముడి స్కిట్‌ను చూసిన హర్యానా సీఎం ఖట్టర్ ప్రోటోకాల్‌ను వీడి శ్రీరాముడి పాత్ర ధరించిన వ్యక్తికి పాదాభివందనం చేశారు
Jan 26, 2024, 11:48 am IST
మణిపూర్

ఆకట్టుకున్న మణిపూర్ శకటం. 500 ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఇమా కేతిల్ మార్కెట్ ప్రదర్శన. ఈ మార్కెట్‌ను మహిళలే నిర్వహిస్తుండటం విశేషం. ప్రపంచంలో ఇలా ఒక మార్కెట్‌ను నడుపుతున్న మహిళలు ఏ దేశంలోను లేరు
Jan 26, 2024, 11:45 am IST
తెలంగాణ

హైదరాబాదులో జాతీయపతాకాన్ని ఎగురవేసిన ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
Jan 26, 2024, 11:39 am IST
అరుణాచల్ ప్రదేశ్

ఆకట్టుకున్న అరుణాచల్ ప్రదేశ్‌ శకటం
Jan 26, 2024, 11:32 am IST

ఒంటెలపై బ్యాండ్‌తో మార్చ్ పాస్ట్ నిర్వహించిన బీఎస్‌ఎఫ్ జవాన్లు
Jan 26, 2024, 11:27 am IST

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన మహిళా జవాన్లు తొలిసారిగా కర్తవ్యపథ్ వద్ద మార్చ్ పాస్ట్ నిర్వహించారు. దేశంలో మహిళా శక్తిని చాటారు
Jan 26, 2024, 11:25 am IST

ఆకట్టుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శకటం.సాక్ష్యం,స్వశక్తి,ఆత్మనిర్భర్‌ అనే నినాదాలతో కర్తవ్యపథ్ పై కదిలిని శకటం
Jan 26, 2024, 11:12 am IST

కర్తవ్యపథ్ పై తొలిసారిగా పరేడ్ నిర్వహిస్తోన్న త్రివిధ దళాలకు చెందిన మహిళా జవాన్లు
Jan 26, 2024, 11:00 am IST

జోర్డాన్‌లో గణతంత్ర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్
Jan 26, 2024, 10:59 am IST

కర్తవ్యపథ్‌లో పరేడ్ నిర్వహిస్తున్న ఫ్రాన్స్ బృందం. ఈ బృందానికి కెప్టెన్ నోయల్ నేతృత్వం వహించారు. పైనే ఫ్రాన్స్ ‌కు చెందిన రాఫెల్ యుద్ధవిమానాలు దర్శనమిచ్చాయి
Jan 26, 2024, 10:52 am IST

కర్తవ్యపథ్‌లో ఎంఐ-17IV హెలికాప్టర్ల విన్యాసాలు
Jan 26, 2024, 10:46 am IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా 100 మంది మహిళలతో పరేడ్ నిర్వహణ. సంగీత వాయిద్యాలతో పరేడ్ నిర్వహించిన మహిళలు
Jan 26, 2024, 10:45 am IST

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Jan 26, 2024, 10:32 am IST

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు నేష‌న‌ల్ సెల్యూట్ చేసిన బాడీగార్డ్
Jan 26, 2024, 10:29 am IST

క‌ర్త‌వ్య‌ప‌థ్ కు బ‌య‌లుదేరిన రాష్ట్ర‌ప‌తి ముర్ము, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్
Jan 26, 2024, 9:50 am IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
Jan 26, 2024, 9:43 am IST
ఆంధ్రప్రదేశ్

YS Jagan and YS Bharati
గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి.
Jan 26, 2024, 9:39 am IST
ఆంధ్రప్రదేశ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.
Jan 26, 2024, 9:35 am IST
ఢిల్లీ

భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయంలో ఆటపాటలతో సందడిగా సాగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
Jan 26, 2024, 9:30 am IST
ఢిల్లీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.
Jan 26, 2024, 9:29 am IST
ఉత్తర్ ప్రదేశ్

లక్నోలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
Jan 26, 2024, 9:09 am IST
ఒడిషా

భువనేశ్వర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ రఘుబర్ దాస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.
Jan 26, 2024, 8:54 am IST
మహారాష్ట్ర

ముంబైలోని తన అధికార నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.
Jan 26, 2024, 8:44 am IST
తెలంగాణ

తెలంగాణలో 10 సంవత్సరాల రాజ్యాంగ వ్యతిరేక, నియంతృత్వ పాలనకు తెర పడింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. దురహంకారానికి, నియంతృత్వ ధోరణికి చోటు లేదని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.
Jan 26, 2024, 8:20 am IST
తమిళనాడు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ ఆర్ ఎన్ రవి. హాజరైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.
Jan 26, 2024, 8:13 am IST
మహారాష్ట్ర

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.
Jan 26, 2024, 8:12 am IST
ఢిల్లీ

రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Jan 26, 2024, 8:09 am IST
తెలంగాణ

SCR
సికింద్రాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ గ్రౌండ్స్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించిన దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+