కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి: నదిలో పడి 77 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 77 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వంద మందికిపైగా నదిలోనే ఉన్నట్లు సమాచారం. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
కేబుల్ బ్రిడ్జిపైకి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ఒక్కసారిగా.. ఆ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో వందల సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

వారం రోజుల క్రితం ఆ కేబుల్ బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహించిన అనంతరం మూడు రోజుల క్రితం తిరిగి సందర్శకులను అనుమతించారు. అయితే, ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సామర్థ్యానికి మించిపోవడంతో ఆ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న సుమారు 400 మందికిపైగా సందర్శకులు నదిలో పడిపోయారని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నదిలో పడిపోయిన వారిని బయటికి తీసి వెంట వెంటనే అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.
Extremely dangerous visuals of criminals deliberately kicking and damaging #Morbibridge with intent to sabotage which resulted in bridge collapse and deaths of innocents.
— Space Dawg (@Orgine6) October 30, 2022
These criminals shoukd be caught and punished under NSA Act.#Morbi #MorbiGujarat #morbibridgecollapse pic.twitter.com/Dj9ti4B2Jv
కాగా, కొందరు యువకుల గుంపు కేబుల్ బ్రిడ్జీకి సంబంధించిన తీగలను లాగుతూ, తంతు కనిపించడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రమాదానికి ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలే అది రిపేర్ చేసిన వంతెన.. ఇలాంటివి చేస్తే ఆగుతుందా? అని అంటున్నారు. కాగా, 1879, ఫిబ్రవరి 20న ఈ వంతెనను ప్రారంభించడం గమనార్హం. అంటే దాదాపు 140ఏళ్లు అయ్యాయి ఈ వంతెన ప్రారంభించి.
ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(సిట్)తో దర్యాప్తునకు ఆదేశించింది.
బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక దళాలు, రాజ్‌కోట్, కచ్ నుంచి స్టీమర్‌లు అన్నీ మోర్బీ కోసం బీలైన్‌లో ఉన్నాయి. మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన ప్రతి వ్యక్తికి రూ.50 వేలు చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబానికి రూ. 4 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 పరిహారం అందజేస్తుంది.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022
ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతి
ప్రమాద ఘటనంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురైనట్లు వెల్లడించారు. గుజరాత్ సీఎం భూపేంద్రభాయి పటేల్, ఇతర అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సీఎం పటేల్ తెలిపారు.
ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనతో ఆవేదనకు గురైనట్లు చెప్పారు. క్షతగాత్రులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.












Click it and Unblock the Notifications