• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మట్టిదిబ్బగా ధౌలి గంగా: సొరంగాన్ని కప్పేసిన బురద: మృతదేహాల కోసం గాలింపు

|

డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చోటు చేసుకున్న దుర్ఘటనలో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం రాత్రంతా గాలించారు. కొందరిని ప్రాణాలతో కాపాడగలిగారు. తపోవన్ ప్రాంతం మొత్తం మట్టి దిబ్బగా మారింది. బురదలో పేరుకుపోవడం వల్ల గల్లంతైన వారిని గాలించడం కష్టతరమౌతోందని చమోలీ జిల్లా పోలీసులు పేర్కొన్నారు.

  Rescue workers reached Reni village in Chamoli district of Uttarakhand | Oneindia Telugu

  ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ ప్రాంతం గుండా ప్రవహిస్తోన్న ధౌలిగంగా నదికి అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడం వల్ల దాని మీద నిర్మిస్తోన్న ఆనకట్ట తెగిపోయింది. 24 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో తపోవన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఉన్న కార్మికులందరూ ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఆనకట్ట తెగడం వల్ల దిగువకు ప్రవహించిన ధౌలిగంగ జలాలు రైనీ గ్రామాన్ని ముంచెత్తాయి. వరద నీటి ప్రవాహానికి పలు నివాసాలు కొట్టుకెళ్లాయి. నందా దేవి జాతీయ పార్క్‌లో మంచు చరియలు విరిగి పడటం వల్ల ధౌలిగంగా నదికి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది.

  8 bodies have been recovered from the rescue operation in Tapovans Dhauliganga

  దీని ప్రభావం మందాకిని నదిపైనా పడింది. ఆదివారం రాత్రి మందాకిని నది ఉప్పొంగింది. ఫలితంగా- నదీ తీర ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలను కొద్దిసేపు నిలిపివేశారు. దాని ప్రవాహం తగ్గిన తరువాత మళ్లీ సహాయక చర్యలను చేపట్టారు. హరిద్వార్, హృషికేష్, దేవప్రయాగ ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. తీర ప్రాంతాల్లో ఎవరినీ అనుమతించట్లేదు. వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ధౌలిగంగాకు ముంచుకొచ్చిన ప్రవాహ ప్రభావంతో ఈ నదిపై నిర్మించిన వంతెనలన్నీ దెబ్బతిన్నాయి.

  8 bodies have been recovered from the rescue operation in Tapovans Dhauliganga

  రాత్రంతా కొనసాగించిన గాలింపు చర్యల సందర్భంగా ఎనిమిది మృతదేహాలను వెలికి తీయగలిగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరి కొందరిని ఆసుపత్రికి తరలించారు. జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోన్న తపోవన్ వద్ద నిర్మించిన టన్నెల్‌లో ఎక్కువ మంది చిక్కుకుని పోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ టన్నెల్‌పై మోకాలి లోతు వరకు బురద పేరుుకని పోయింది. దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సొరంగంలో మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆనకట్ట తెగిన సమయంలో ఎక్కువ మంది కార్మికులు సొరంగంలో చిక్కుకునిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

  వీడియో: రేవంత్ రెడ్డి.. రాత్రికి రాత్రి పాదయాత్రకు శ్రీకారం: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యం

  8 bodies have been recovered from the rescue operation in Tapovans Dhauliganga

  8 bodies have been recovered from the rescue operation in Tapovans Dhauliganga

  English summary
  SDRF members wait for the level of the Mandakini river to lower, to commence rescue operations for the people who're stranded in the tunnel near the Tapovan Dam in Chamoli. Eight bodies have been recovered from the rescue operation in Tapovan's Dhauliganga, in Chamoli district.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X