వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: లోయలో పడ్డ బస్సు -8మంది దుర్మారణం -11 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

పర్వతాల మయంగా ఉండే హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని చంబా జిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. తీసా సబ్‌ డివిజన్‌ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.

విశాఖ ఉక్కుపై సంచలనం: ఉద్యమానికి తెలంగాణ మద్దతు -రాష్ట్ర ప్రభుత్వాలనూ మోదీ అమ్మేస్తాడు: KTRవిశాఖ ఉక్కుపై సంచలనం: ఉద్యమానికి తెలంగాణ మద్దతు -రాష్ట్ర ప్రభుత్వాలనూ మోదీ అమ్మేస్తాడు: KTR

తీసా నుంచి బయలుదేరిన బస్సు చంబాకు వస్తుండగా.. చంబా-ఖజ్జియార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చంబా హాస్పిటల్‌కు తరలించారు.

 8 Dead, 11 Injured After Bus Falls Into Gorge In Himachal Pradesh’s Chamba

సంఘటనా స్థలంలోనే ఆరుగురు చనిపోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. మలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా,

మహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం -దేత్త‌డి హారికనే అంబాసిడర్ -తొలగింపు వట్టిదే: TSTDC చైర్మన్ క్లారిటీమహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం -దేత్త‌డి హారికనే అంబాసిడర్ -తొలగింపు వట్టిదే: TSTDC చైర్మన్ క్లారిటీ

చంబా బస్సు దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ విచారం వ్యక్తం చేసింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్, చురా ఎమ్మెల్యే హన్స్‌రాజ్ సహా ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే గాయపడ్డ వారికి కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు రూ.20 వేలు, గాయపడ్డవారికి రూ.5వేలు అందజేశారు.

English summary
Eight people were killed and 11 others injured as a private bus fell into a deep gorge in Himachal Pradesh's Chamba district on Wednesday, police said. The accident occurred in Teesa sub-division in the morning, Chamba Superintendent of Police S Arul Kumar told PTI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X