ఉరిశిక్ష బిల్లు పాసైన గంటల వ్యవధిలోనే బాలికపై రేప్
భోపాల్: కఠినమైన శిక్షలు వేస్తే నేరాలు తగ్గుముఖం పడుతాయనే ఆలోచనకు విఘాతం కదిలింది. బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష వేయాలనే బిల్లును ఆమోదించిన కొన్ని గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పొరుగున ఉండే యువకుడే ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు. సోమవారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇతర పిల్లలతో పాటు బాధితురాలు తన ఇంట్లో టీవీ చూస్తుండగా సందీప్ చగన్‌లాల్ అనే 19 ఏళ్ల యువకుడు లోనికి ప్రవేశించాడు. ఇతర పిల్లలను ఇంట్లోంచి తరిమేసి బాలికపై అతను అత్యాచారం చేశాడు. దేపలూరు తాహిసిల్ చందర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. బాలిక సమీప బంధువు ఇంట్లోకి ప్రవేశించగానే నిందితుడు పారిపోయాడు.












Click it and Unblock the Notifications