అరు నెలల పాటు అమ్మాయిపై రేప్: 80 ఏళ్ల వృద్ధుడితో సహా ఆరుగురు రేప్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ టీనేజీ అమ్మాయిపై ఆరుగురు మానవ మృగాలు ఆరు నెలలుగా అత్యాచారం చేస్తూ వచ్చాయి. అమ్మాయిపై అత్యాచారం చేసినవారిలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నాడు.

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. అమ్మాయి గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు బాధితురాలు ఆ విషయం చెప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు జాతీయ మీడియాలో వచ్చాయి.

కేసులో ఐదుగురి అరెస్టు...

కేసులో ఐదుగురి అరెస్టు...

అమ్మాయిపై అత్యాచారం జరిగిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వృద్ధుడు పరారీలో ఉన్నాడు. అతన్ని సుఖదేవ్ తీవారీగా గుర్తించారు.తన గ్రామానికి భూరా రజక్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం తనపై అత్యాచారం చేశాడని 16 ఏళ్ల బాధితురాలు ఎస్పీ శశికాంత్ శుక్లాకు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

మౌనాన్ని అవకాశంగా తీసుకుని...

మౌనాన్ని అవకాశంగా తీసుకుని...

తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని వెల్లడిస్తే సాంఘిక బహిష్కరణ చేస్తారనే భయంతో అమ్మాయి మౌనంగా ఉండిపోయింది. దాన్ని అవకాశంగా తీసుకుని మరో వ్యక్తి వచన్ రజక్ ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం జరిగిందనే విషయం అందరికీ చెబుతానని బెదిరించి ఆమెను అతను లొంగదీసుకున్నాడు.

 వరుసగా రేప్ చేస్తూ వెళ్లారు...

వరుసగా రేప్ చేస్తూ వెళ్లారు...

ఆ తర్వాత వచన్, రజక్ ఆమెపై అత్యాచారం సాగిస్తూ వెళ్లారు. ఆ తర్వాత మరో నలుగురు సుఖదేవ్, సోను రజక్, రాజకుమార్ రజక్, రవి రజక్ ఆమెపై అత్యాచారం సాగిస్తూ వెళ్లారు. వచన్ రజక్ మాదిరిగానే ఆమెను బెదిరిస్తూ ఆమై అఘాయిత్యం సాగిస్తూ వెళ్లారు.

సాంఘిక బహిష్కరణ చేస్తారని భయపడి...

సాంఘిక బహిష్కరణ చేస్తారని భయపడి...

తనపై అత్యాచారం జరిగిందనే విషయం బయటపడితే తన కుటుంబానికి సాంఘిక బహిష్కరణ చేస్తారనే భయంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. చివరకు గర్భం దాల్చడంతో తన తల్లికి విషయం చెప్పక తప్పలేదు. దీంతో బుధవారంనాడు కుటుంబ భ్యులు ఖమారియా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+