84 రోజులకి 84జీబీ: పోటాపోటీ ఆఫర్లు.. ఏది బెస్ట్?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఆఫర్ మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఇప్పటి వరకు అపరిమిత కాల్స్, రోజుకి 1జీబీ డాటాను ఉచితంగా పొందిన జియో కస్టమర్లు ఆగస్టు 17 నుంచి నెలకు రూ. 399 చెల్లించి ఈ సేవలను కొనసాగించాల్సి ఉంటుంది.

అయితే తాజాగా జియోకు పోటీగా ఇతర టెలికాం సంస్థలు కొత్త ఆఫర్లను తీసుకొచ్చాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు తమ నెట్‌వర్కులపై 84 రోజులకి 84జీబీ 4జీ డాటాను ఆఫర్ చేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. మరి ఈ మూడు నెట్‌వర్క్ లు అందించే ప్లాన్లలో ఏది ఉత్తమమో తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి.

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్...

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్...

ఎయిర్‌టెల్ కొత్త రూ. 399 ప్లాన్ కింద రోజుకి 1జీబీ హైస్పీడ్ 4జీ డాటాను పొందొచ్చు. కాల పరిమితి 84 రోజులు. డాటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 4జీ హ్యాండ్‌సెట్స్ వాడుతున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌కు ఇతర ఏ ఆఫర్‌కు అదనంగా వేసుకోవడానికి కుదరదు. ఈ ఆఫర్‌లో ఉచితంగా ఎస్ఎంఎస్‌లు ఇవ్వడంలేదు.

రూ. 244 ప్లాన్ కూడా...

రూ. 244 ప్లాన్ కూడా...

రూ. 399 ప్లాన్ కాకుండా ఎయిర్ టెల్ మరో చౌక ప్లాన్‌ను కూడా అందిస్తోంది. రూ. 244 రీచార్జ్‌తో 70 రోజులపాటు రోజుకి 1జీబీ డాటా చొప్పున ఆఫర్ చేస్తోంది. అయితే ఇందులో ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు మాత్రమే అపరిమిత కాల్స్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోలేరు.

వొడాఫోన్ రూ. 352 ప్లాన్

వొడాఫోన్ రూ. 352 ప్లాన్

రోజుకి 1జీబీ హైస్పీడ్ 4జీ డాటాను 84 రోజులపాటు అందించడానికి వొడాఫోన్ రూ. 352 ప్లాన్‌ను తీసుకొచ్చింది. డాటాతో పాటు ఉచిత రోమింగ్, అపరిమిత కాల్స్ కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్లాన్‌లో లేని అపరిమిత మెసేజ్ ఆఫర్ ఈ వొడాఫోన్ ప్లాన్‌లో ఉంది.

జియో రూ. 399 ప్లాన్

జియో రూ. 399 ప్లాన్

ఇక జియో ఆఫర్ గురించి చాలా మందికి తెలిసిందే. రూ. 399 పెట్టి రీచార్జ్ చేసుకుంటే 84 రోజులపాటు రోజుకి 1జీబీ చొప్పున హైస్పీడ్ 4జీ డాటాను పొందొచ్చు. అలాగే వీవోఎల్టీఈ టెక్నాలజీపై హెచ్‌డీ క్వాలిటీతో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఇక జియో మ్యూజిక్, జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే జియో రూ. 309 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కింద 56 రోజులపాటు రోజుకి 1జీబీ 4జీ డాటా వస్తుంది. అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు షరా మామూలే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jio's entry has forced giants like Airtel and Vodafone to drastically reduce their tariffs and offer free calls in order to remain relevant in the market. Bharti Airtel And Vodafone -- two of the biggest players in the India market have been experimenting with various tariffs, data pricing strategies and plans both in the prepaid and post-paid segment in order to compete with Jio. These offers have taken a big toll on their profits and revenues. But for consumers, the competition has been great so far. As a part of their latest salvo against Reliance Jio, Vodafone and Airtel have unveiled new pre-paid plans that effectively offer 84GB of 4G data for 84 days along with unlimited calls for less than 400 rupees.
Please Wait while comments are loading...