వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆపరేషన్ స్మైల్': 14 ఏళ్ల తర్వాత 87 మంది చిన్నారుల ఆచూకీ లభ్యం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హరిద్వార్: 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు హరిద్వార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అదృశ్యమైన పిల్లల్లో 87 మందిని ఉత్తరాఖండ్ పోలీసులు కనిపెట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న హరిద్వార్‌లో 'ఆపరేషన్ స్మైల్'ను ప్రారంభించారు. అందులో భాగంగా చిన్నారులను కనిపెట్టినట్లు సీనియర్ పోలీసులు వెల్లడించారు.

'ఆపరేషన్ స్మైల్'ను ప్రారంభించిన 18 రోజుల వ్యవధిలోనే 87 మంది చిన్నారుల ఆచూకీని తెలుసుకున్నామని హరిద్వార్ ఎస్ఎస్‌పీ స్వీటీ అగర్వాల్ తెలిపారు. హరిద్వార్ జిల్లాలోని రూర్కీ, మంగళూరు, లుస్కార్ తదితర ప్రాంతాల్లో 43 మంది బాలికలతోపాటు 44 బాలురను గుర్తించామని అన్నారు.

87 children missing since 2000 found in Haridwar

పిల్లలను వారి తల్లిదండ్రులకు తిరిగి అప్పగించినట్లు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లాలో 146 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని ఆమె పేర్కొన్నారు. అందులో 88 మంది అబ్బాయిలు కాగా, 58 మంది అమ్మాయిలని చెప్పారు.

'ఆపరేషన్ స్మైల్' వల్ల అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చిన్నారుల ఆచూకీ కనిపెట్టగలిగామని, త్వరలోనే మిగతా వారి ఆచూకీని తెలుసుకుంటామని అన్నారు.

English summary
Uttarakhand police has traced as many as 87 children, who were missing for the last 14 years, from different parts of Haridwar district in a span of 18 days as part of a special drive launched in the New Year, a senior official said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X