• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హ్యాట్సాఫ్: ఈ బామ్మ తయారు చేసే బ్యాగులకు జనాలు క్యూ కడుతున్నారు

|
  ఆన్‌లైన్‌లో హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్న బామ్మ...!!

  ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశామని అనుకుంటాం. పూర్తి అవుతుందో కాదో తెలియని ఈ కొత్త పనిని మొదలు పెట్టి ఉన్న సమయాన్ని వృథా చేసుకోవడం దేనికని ప్రశ్నిస్తాం... కానీ నైపుణ్యత పనిపట్ల అంకిత భావం ఉంటే వయస్సుతో కానీ, సమయంతో కానీ పనిలేదని నిరూపించింది ఈ 89 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఈ బామ్మ ఏం చేసిందనేగా మీ డౌటు.. కింద చదవండి.

  అస్సోంలో ప్రారంభమైన బామ్మ కథ

  అస్సోంలో ప్రారంభమైన బామ్మ కథ

  ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ బామ్మ పేరు లతిక చక్రవర్తి. ఆమె కథ అస్సోంలోని దుబ్రిలో ప్రారంభమైంది. అక్కడే ఆమె జన్మించింది. అయితే కృష్ణ లాల్ చక్రవర్తి అనే ఆయనతో ఆమెకు వివాహం అయ్యింది. కృష్ణలాల్ చక్రవర్తి సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. కృష్ణలాల్ మృతి అనంతరం ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ఆమె కుమారుడు రాజ్ చక్రవర్తి దగ్గరకు మకాం మార్చింది. ఇక కొడుకుతో పాటే ఆమె ప్రయాణం సాగింది. కొడుకు దేశవ్యాప్తంగా తిరగాల్సి వచ్చేది. ఆయనతో పాటే తల్లి లతికా కూడా తిరిగేది.

  కొడుకు పనిచేసిన ప్రాంతాల్లో ఉన్న బామ్మ లతిక అక్కడ దొరికే వస్త్రాలు తీసుకుంటుంది. కొన్ని అద్భుతమైన బట్టలు కుడుతుంది. ఇప్పటి వరకు ఆమె కుట్టిన ప్రతి వస్త్రం వెనక ఒక కథ ఉంటుంది. చీర కుట్టిన, కుర్తా కుట్టినా దానికి ఒక కథ ఉంటుంది. అదే ఆ చీరలో ఆ ప్రాంతానికి సంబంధించి విశిష్టత, ప్రాముఖ్యత దాగి ఉంటుంది. ఆ ప్రాంతం సంస్క‌ృతి, అందం ఉట్టి పడుతుంది. ఆ జ్ఞాపకాలతోనే మరో ప్రాంతానికి వెళ్లేది లతిక.

  పాత బట్టలపై కొత్త డిజైన్లతో పొట్లి బ్యాగులు

  పాత బట్టలపై కొత్త డిజైన్లతో పొట్లి బ్యాగులు

  పాత బట్టలకు కొత్త డిజైన్లు వేయడంలో లతిక దిట్ట. అంతేకాదు పాత బట్టల నుంచి చిన్న సైజులో బ్యాగులు కుట్టడంతో పాటు దానిపై డిజైన్లు వేయడం బామ్మ ప్రత్యేకత. ఇలా చిల్లర డబ్బులు దాచుకునేందుకు కావాల్సిన చిన్న బ్యాగులను చాలా అట్రాక్టివ్ డిజైన్‌తో కుడుతుంది. ఇందకు తన కోడలు సుస్మితా కూడా సహకరిస్తుంది. ఆ పొట్లి బ్యాగ్‌కు కావాల్సిన బొందల నుంచి ఆ బ్యాగ్ పూర్తయ్యేవరకు మొత్తం చేతి కుట్టే కనబడుతుంది. ఒకదానికి ఒకటి పొంతనే ఉండదు. ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సిల్క్‌తో చేసిన బ్యాగులు, పెళ్లిళ్ల సమయంలో మహిళలు తీసుకెళితే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది.

  ధర కాస్త ఎక్కువే.. బామ్మ కష్టం ముందు అది చాలా తక్కువ

  ధర కాస్త ఎక్కువే.. బామ్మ కష్టం ముందు అది చాలా తక్కువ

  అయితే లతిక బామ్మ చేతి నుంచి జాలువారిన ఈ అద్భుతమైన డిజైన్ల ధర రూ.500. ఇది ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఆ వయస్సులో ఆమె ఎంతో ఇష్టంగా, మంచి క్వాలిటీతో చేతితో డిజైన్ వేయడం, చేతికుట్టు ఆమెకున్న అంకిత భావానికి ఐదువందల రూపాయలు చాలా తక్కువే అనిపిస్తుంది. ఇప్పటికే లతిక బామ్మ ఆమె చేతి కుట్టు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది.

  బామ్మ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

  బామ్మ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

  బామ్మకు ఇక ఉన్న ఒకే ఒక స్నేహితురాలు. గత 64 ఏళ్లుగా ఆమెతోనే ఉంటోంది.ఇంతకీ ఎవరో తెలుసా లతిక బామ్మ స్నేహితురాలు.. కుట్టు మిషన్. అవును ఆ కుట్టు మిషనే బామ్మకు బెస్ట్ ఫ్రెండ్ అట. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎలా పాపులర్ అయ్యారంటే... లతిక మనవడు జాయ్... జర్మనీలో ఉంటాడు. ఒకసారి తన నానమ్మ చేసిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఇవి ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయాలని తలచి ఒక వెబ్‌సైట్ ప్రారంభించాడు. దీనికి లతిక బ్యాగ్స్ అని పేరు పెట్టాడు. ఇంకే.. బామ్మ బ్యాగ్స్‌కు ఆన్‌లైన్‌లో యమ క్రేజ్ ఏర్పడింది.

  చూశారుగా.. మీకు టాలెంట్, ఇష్టం ఉంటే ఒక పనిని పూర్తి చేసేందుకు సమయం అడ్డురాదు. ఇందుకు నిదర్శనమే ఈ 89ఏళ్ల లతిక బామ్మ కథ.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  How many times we give up on things because we feel we're too old for it?Be it taking up a hobby or starting something of our own, many of us start feeling like we've already wasted too much time. We tell ourselves that it's too late.But Latika Chakravorty's story will prove all of you wrong.This 89 year old lady prepares bags with art work.Her pieces have gone viral that she even runs a website.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more