8th Pay Commission: గుడ్ న్యూస్ - భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు..?
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. 8వ వేతన సంఘం 2026 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ కమిషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు రెట్టింపు కానున్నాయి. వేతన పెంపు, పెన్షన్లు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి కీలక అంశాల ఆధారంగా ఒక్కో ఉద్యోగి వేతనం అమాంతం పెరగనుంది. జనవరి 1వ తేదీ నుండి వారి జీతభత్యాల్లో ఈ పెరుగుదల ఉండబోతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 8వ వేతన సంఘానికి ఇదివరకే ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, భత్యాలతో పాటు కరువు భత్యం (డీఏ)ను కూడా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి ఉద్దేశించినది. ఉద్యోగుల జీతాలు, రిటైర్‌మెంట్ పెన్షన్లను ఎప్పటికప్పుడు సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాలను ఏర్పాటు చేస్తుంది.

8వ వేతన సంఘం కింద వేతనాల పెంపు శాతానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం దేశ ఆర్థిక ద్రవ్యోల్బణానికి సంబంధించి నిర్ణయించే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుండి 2.57 శాతం వరకు ఉండొచ్చు. ఇది దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. 2.57 శాతాన్ని ఖరారు చేయవచ్చని సమాచారం.
ఈ పే కమిషన్ (8th Pay Commission) లో ప్రతిపాదించిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను బట్టి ఒక్కో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస మూల వేతనం రూ. 18,000 నుండి రూ. 51,480 వరకు పెరిగే అవకాశం ఉంది. రక్షణ శాఖతో కలిపి దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ ఫిట్మెంట్ ప్రకారం.. సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
కొత్త ఆర్థిక చట్టం 2025 కింద కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కరువు భత్యం పెంపు ఆగిపోతుందని ఇదివరకు వచ్చిన వార్తలను కేంద్రం తోసిపుచ్చింది కూడా. దీనిపై ఇప్పటివరకు నెలకొన్న అనిశ్చితిని తొలగించినట్టయింది. ఆ వార్తలను నిరాధారమైనవని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు దురుసు ప్రవర్తన కారణంగా తప్ప డీఏ పెంపు, వేతన సంఘాల సవరణలు వంటి రిటైర్‌మెంట్ అనంతర ప్రయోజనాలు ఆపబోమని వివరించారు.
8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయించేటప్పుడు ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. 2015లో 7వ వేతన సంఘం నుండి మారకుండా ఉన్న ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం దీని ముఖ్యొద్దేశం. ఈ సందర్భంగా ద్రవ్యోల్బణంలో చోటు చేసుకునే హెచ్చుతగ్గులు, వాస్తవ వేతనాల క్షీణత, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం, ఖజానాపై పడే భారం.. అలాగే దాని విస్తృతమైన వేతన విధానాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని నిపుణులు తెలిపారు. దీనిపై మింట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications