కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు ఎంత పెరుగుతాయంటే..?
8వ వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతనసంఘం ఏర్పడితే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఉద్యోగి వేతనం దాదాపు రూ.19వేల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 7వ వేతన సంఘంలో లాగానే కొత్త జీతాలు కూడా 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' ఆధారంగా ఉండనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేతన సంఘం.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్, ఇతర జీత భత్యాలను సమీక్షిస్తోంది. ప్రతి పదేళ్లకోసారి ఈ రివ్యూ నిర్వహిస్తుంది. ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఉద్యోగి జీతభత్యాలను సవరిస్తూ ఉంటుంది వేతన సంఘం. అయితే ఈ సవరణలు కేంద్రం కేటాయించిన బడ్జెట్ పై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి నెలకు రూ. లక్ష జీతం వస్తుంది అనుకుందాం. అయితే 8వ వేతన సంఘంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్లు కేటాయిస్తే.. అప్పుడు ఆ ఉద్యోగి జీతం రూ.1,14,600 కు చేరుతుంది. ఒకవేల రూ.2లక్షల కోట్లు కేటాయిస్తే.. అప్పుడు ఆ ఉద్యోగి జీతం రూ. 1,16,700లకు చేరుతుంది. ఇక కేంద్ర బడ్జెట్ లో రూ. 2.25 లక్షల కోట్లు కేటాయిస్తే ఆ ఉద్యోగి జీతం రూ. 1,18,000కు చేరుతుంది.
ఇక వేతన సవరణ సంఘం ప్యానెల్ ఏప్రిల్ 2025లో ఏర్పాటు కానుంది. ఈ ప్యానెల్ సిఫార్సులు 2026 లేదా 2027లో అమల్లోకి రానున్నాయి. 8వ వేతన సంఘానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇంకా నిర్ణయించలేదు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని బట్టి జీతం పెరుగుతుంది కాబట్టి ఫిట్ మెంట్ 2.57 లేదా అంతకంటే ఎక్కువ పెంచాలని పలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఫిట్ మెంట్ 1.92 కు దగ్గరగా ఉండే అవకాశం ఉందని మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications