అస్సాంలో బస్సు ప్రమాదం: అక్కడిక్కడే 9 మంది మృతి

న్యూఢిల్లీ: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం అస్సాం రాష్ట్ర రోడ్డు రవాణాకు చెందిన బస్సు కలియబోర్‌ జిల్లా, నగావ్‌లో కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ అతి వేగంమే కారణమని అధికారులు పేర్కొన్నారు.

క్షతగాత్రులను సమీపంలోని నాగాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు లక్ష్మీపూర్ జిల్లా నుంచి గౌహతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు.

9 Killed, 17 Injured in Bus Accident at Nagaon in Assam

ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో మొత్తం 33 మంది ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతికి వంద కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన జరిగింది.

మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళుతున్న జీపు, లారీ ఢీ కొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+