ముంబై బట్టల గోడౌన్‌లో అగ్ని ప్రమాదం..9 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

ముంబై: ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువకముందే ముంబైలోని నివాస ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. కిరారీ ప్రాంతంలో ఉన్న బట్టల గోడౌన్‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో అనాజ్ మండిలో చోటుచేసుకున్న ప్రమాదంలో 43 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

విలేపార్లేలోని బజాజ్‌ రోడ్డులో ఉన్న లబ్‌శ్రీవలి భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడు ఎనిమిద అంతస్తులో ఉన్న మూడు ఫ్లాట్లకు మంటలు వ్యాపించాయి. రెండు గంటల పాటు మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.ఇక ఫైర్ సిబ్బంది కాపాడిన వారిలో ఒక మహిళతో పాటు ఐదు మంది ఉన్నారు. టెర్రస్‌పై ఎవరూ లేరని అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనేదానిపై విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

9 killed after fire broke down in Mumbais cloth go down

ఎనిమిదవ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆ సమయంలో ఒక ఫ్లాట్‌లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. విచారణ తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఆదివారం కావడం అది కూడా రాత్రి సమయం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+