స్కార్పియో తుక్కు తుక్కు: అతివేగం..నిద్రమత్తు: 9 మందిని పొట్టన బెట్టుకున్న రోడ్డు ప్రమాదం
లక్నో: అతి వేగం.. నిర్లక్ష్యం తొమ్మిది మంది ప్రాణాలను బలి తీసుకుంది. వారి కుటుంబాలను అనాథలను చేసింది. శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా వాజిద్‌పూర్-నవాబ్‌గంజ్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రాజస్థాన్‌లో తమ బంధువుల ఇంట్లో ఓ శుభ కార్యానికి హాజరైన ఓ కుటుంబం తమ స్వస్థలం బిహార్‌లోని భోజ్‌పూర్‌కు స్కార్పియో వాహనంలో బయలుదేరింది. డ్రైవర్ సహా పదిమంది ఈ వాహనంలో బయలుదేరారు. ఈ తెల్లవారు జామున మార్గమధ్యలో ప్రతాప్‌గఢ్ జిల్లా వాజిద్‌పూర్-నవాబ్‌గంజ్ సమీపంలోకి రాగానే స్కార్పియో ఓ ట్రక్కును ఎదురుగా ఢీ కొట్టింది. ఎంత బలంగా ఢీ కొట్టిందంటే.. స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.ఇంజిన్ డ్రైవర్ సీట్లోకి చొచ్చుకుని వచ్చింది.

స్కార్పియోలో ప్రయాణిస్తోన్న 10 మందిలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతణ్ని ప్రతాప్‌గఢ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం లక్నోకు తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే ప్రతాప్‌గఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, నవాబ్‌గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అంతకుముందే వర్షం పడిందని, వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ.. వాహనాన్ని వేగంగా నడిపించినట్లు స్పష్టం చేశారు. ప్రమాదం చోటు చేసుకునే సమయానికి స్కార్పియో వాహనం 100 కిలోమీటర్ల వేగానికి మించి ప్రయాణించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. నిద్రమత్తు కూడా ఓ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నామని అన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications