వంద మందికి చేరిన కోటా ఆస్పత్రి మృతుల సంఖ్య, ముగ్గురికి ఒకే బెడ్, తక్కువ బరువుతో జననం...
రాజస్థాన్‌లోని కోటా ఆస్పత్రిలో చిన్నారుల మృత్యువాత కొనసాగుతూనే ఉంది. ఇటీవల 91 మంది చిన్నారులు చనిపోయారనే సంచలనం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు, నాలుగురోజులకు మరో 9 మంది చిన్నారులు మృతిచెందారనే అంశం ప్రతీ ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తోంది.

ఐదుగురు తగ్గారట..
9 మంది చిన్నారులతో కోటాలోని జేకే లాన్ ఆస్పత్రిలో చనిపోయిన మృతుల సంఖ్య వందకి చేరింది. ఈ నెల 23-24 తేదీల్లో 91 మంది వరకు చిన్నారులు చనిపోయారు. మూడు, నాలుగు రోజులకు మరికొందరు మృతిచెందారు. అయితే దీనిపై ఆస్పత్రి వర్గాలు తమదైనశైలిలో సమాధానం ఇస్తున్నారు. 2018లో 1005 మంది చనిపోతే.. 2019లో అది వెయ్యికి చేరిందని.. అంటే తగ్గిందని కవర్ చేసుకుంటున్నారు.

తక్కువ బరువుతో...
ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారులు తక్కువ బరువుతో జన్మిస్తున్న సూపరింటెండెంట్ పేర్కొన్నారు. చిన్నారుల మృతిపై దుమారం రేగడంతో మంగళవారం కోటా ఆస్పత్రిని బీజేపీ పార్లమెంటరీ సభ్యులు లాకెట్ ఛటర్జీ, కాంతా కర్దామ్, జాస్కౌర్ మీనా తదితరులు పరిశీలించారు. ఆస్పత్రిలో మౌలిక వసతుల సదుపాయాల కల్పనను పరిశీలించారు.

ముగ్గురికి ఒక్కటే బెడ్..
ఆస్పత్రిలో ఇద్దరు, లేదంటే ముగ్గురు చిన్నారులు ఒకే పడక మంచంపై ఉంచినట్టు గుర్తించారు. అలాగే చిన్నారులకు సరిపడ నర్సులు లేరని గుర్తించారు. అంతకుముందు జాతీయ చిన్నారుల హక్కుల కమిషన్ సభ్యులు రాజస్థాన్ ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీచేశారు.

ఆస్పత్రి కంపౌండ్‌లో పందులు
ఆస్పత్రి పరిసరాల్లో పందులు కూడా తిరుగతాయని చైర్మన్ కనూంగో పేర్కొన్నారు. ఇది కూడా చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉంటుందని తెలిపారు. అయితే రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం చిన్నారులకు సరైన వైద్యం అందజేశారని పేర్కొనడం విశేషం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications