వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron కలకలం: ఒక్కరోజే 16 కొత్త కేసులు, దేశంలో 21కి చేరిక, ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులంటే?

|
Google Oneindia TeluguNews

జైపూర్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు మనదేశంలోనూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఐదు రోజుల క్రితం ఒక్క కేసూ కూడా లేకపోగా.. ఇప్పుడు ఏకంగా 20కిపైగా కేసులు వెలుగుచూడటం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం మహారాష్ట్రలోనే కొత్తగా ఏడు కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో 9 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.

Recommended Video

Omicron Variant : COVID 3rd Wave Alert As India Records 21 Omicron Cases || Oneindia Telugu
రాజస్థాన్ ఒక్కరోజే 9 ఒమిక్రాన్ కొత్త కేసులు

రాజస్థాన్ ఒక్కరోజే 9 ఒమిక్రాన్ కొత్త కేసులు

రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 9 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 21కి చేరింది. రాజస్థాన్ రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు ఒకే కుటుంబం నుంచి కావడం గమనార్హం. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ఆదర్ష్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 9 మందికి ఈ వేరియంట్ వచ్చినట్లు రాజస్థాన్ సర్కారు వెల్లడించింది. వీరంతా కూడా ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిపింది. కాగా, ఇప్పటి వరకు కర్ణాటకలో 2, గుజరాత్, ఢిల్లీల్లో ఒక్కో కేసు చొప్పున, మహారాష్ట్రలో 8 కేసులు వెలుగుచూశాయి. ఆదివారం దేశంలో మొత్తం 16 (రాజస్థాన్ 9, మహారాష్ట్రలో 7) ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.

మహారాష్ట్రలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలో కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు


మహారాష్ట్రలో కొత్తగా మరో ఏడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12కి చేరింది. గతంలో కర్ణాటకలో రెండు, గుజరాత్ రాష్ట్రంలో ఒకటి, ఢిల్లీ ఒకటి, ముంబైలో ఒకటి చొప్పున కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 8కి చేరాయి. నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్ ను గుర్తించారు. ఫ్లిన్లాండ్ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

దేశంలో థర్డ్ వేవ్ తీవ్రత తక్కువే కానీ, జాగ్రత్త అవసరం

దేశంలో థర్డ్ వేవ్ తీవ్రత తక్కువే కానీ, జాగ్రత్త అవసరం

భారతదేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరి నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పీక్స్ లో ఉండనుందని ఆయన అంచనా వేశారు మనీంద్రా అగర్వాల్. అదే సమయంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం గమనార్హం. అయితే, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గురించి భయాందోళనపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని అన్నారు. దక్షిణాఫ్రికా రీసెర్చ్ స్టడీ ప్రకారం.. మనీంద్రా అగర్వాల్ ఏం చెప్పారంటే.. కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ సహజంగా ఉన్న ఇమ్యూనిటీని దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్ కేవలం తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే క్రియేట్ చేస్తుందని అన్నారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షణాలు మాత్రం తక్కువగానే ఉంటాయని పేర్కొన్నారు. కాగా, థర్డ్ వేవ్ సమయంలోనూ లాక్ డౌన్ తప్పదని మనీంద్రా అగర్వాల్ అభిప్రాయడ్డారు. ప్రభుత్వం చూపించే పనితీరును బట్టి దీని ప్రభావం కనిపిస్తుందని, నైట్ కర్ఫ్యూ, నిబంధనలు, గుంపులుగా చేరకుండా చూసుకోవడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల వైరస్ తీవ్రత తారాస్థాయికి చేరుకుండా అడ్డుకోవచ్చని ఆయన వివరించారు.

English summary
9 Omicron Cases In Rajasthan, 7 In Maharashtra Push India’s Tally To 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X