లఢక్‌లో ఘోరం- 9 మంది జవాన్లు కన్నుమూత: యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ

లేహ్: లఢక్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి కిందటే చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారత జవాన్లు కన్నుమూశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

భారత జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు అక్కడికక్కడే కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. లోయలో పడిన వాహనంలో ఉన్న జవాన్లను సురక్షితంగా వెలికి తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టారు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.

9 soldiers lost their lives in an accident in Ladak after the vehicle fell in a gorge

లఢక్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని క్యారీ టౌన్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. క్యారీ టౌన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉన్న లోయలో అదుపు తప్పి పడిపోయింది జవాన్ల వాహనం. భారత్- చైనా వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉన్న కారు గ్యారిసన్ నుంచి ఈ వాహనం బయలుదేరింది. క్యారీ టౌన్‌కు చేరుకోవాల్సి ఉంది.

మార్గమధ్యలో క్యారీ టౌన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రమాదానికి గురైంది. లోతైన అగాథంలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+