వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా కాటుకు క్వారంటైన్ లో యువకుడు, తప్పించుకుని కొరికి చంపేశాడు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తేని: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకున్న యువకుడికి కరోనా వైరస్ (COVID-19) వచ్చిందనే అనుమానం వ్యక్తం కావడంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అయితే నగ్నంగా రోడ్డు మీదకు వచ్చి నానా హంగామా చేసిన ఆ యువకుడు వీధిలో ఇంటి ముందు కుర్చుని ఉన్న వృద్దురాలిని కొరికి చంపిన దారుణ సంఘటన తమిళనాడులో జరిగింది. కరోనా వైరస్ సోకడం వలనే ఆ యువకుడు వృద్దురాలిని కొరికి చంపేశాడని తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు, అధికారులు హడలిపోయారు.

Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్Coronavirus, బెంగళూరులో ఆంధ్రా మహిళ కరోనాతో మృతి, ఫ్యామిలీ మొత్తం వైరస్, రెడ్ అలర్ట్

శ్రీలంకలో వ్యాపారం

శ్రీలంకలో వ్యాపారం

తమిళనాడులోని తేని జిల్లా జక్కమనయకంపట్టికి చెందిన ఓ యువకుడు శ్రీలంకలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను శ్రీలంకకు వెళ్లి బట్టల వ్యాపారం చేస్తూ అప్పుడప్పుడు సొంత ఊరికి వచ్చి వెలుతున్నాడు. శ్రీలంకలో వ్యాపారం చేస్తున్న యువకుడు అతని సొంత ఊరు అయిన జక్కయకంపట్టి ప్రాంత ప్రజలతో గతంలో కలసిమెలసి ఉండేవాడు.

కరోనా దెబ్బకు శ్రీలంక టూ తేని

కరోనా దెబ్బకు శ్రీలంక టూ తేని

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) వ్యాధి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాలతో పాటు అన్ని దేశాల్లో అన్ని వ్యాపారాలు అతలాకుతలం అయ్యాయి. శ్రీలంకలో కరోనా వైరస్ దెబ్బకు బట్టలు కొనుగోలు చేసే ప్రజలు కరువయ్యారు. వ్యాపారం జరగకపోవడంతో ఆ యువకుడు 10 రోజుల క్రితం తేని జిల్లాలోని సొంత ఊరు అయిన జక్కమనయకంపట్టికి చేరుకున్నాడు.

కరోనా క్వారంటైన్ లో యువకుడు

కరోనా క్వారంటైన్ లో యువకుడు

కరోనా వైరస్ కాటు నుంచి ప్రజలను రక్షించడానికి విదేశాల నుంచి భారత్ వస్తున్న వారికి విమానాశ్రయాల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య నివేదికలు వచ్చే వరకు వారిని క్వారంటైన్ లోనే ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, మీ ప్రాణాలతో పాటు ప్రజలు ప్రాణాలు ఎంతో విలువైనవని రెవెన్యూ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇలాగే శ్రీలంక నుంచి తేని జిల్లాలోని సొంత ఊరికి వచ్చిన యువకుడిని అతని ఇంటిలో క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సిగ్గు, భయం, అవమానంతో !

సిగ్గు, భయం, అవమానంతో !

గత 10 రోజుల నుంచి ఇంటిలోని క్వారంటైన్ లో ఉంటున్న ఆ యువకుడు తనను అనవసరంగా కరోనా వైరస్ వచ్చిందని శిక్షిస్తున్నారని, ఇంటి నుంచి బయటకు రానివ్వడంలేదని అవమానం, సిగ్గు, భయంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఎలాగైనా ఇంటి నుంచి తప్పించుకోవాలని గత మూడు రోజుల నుంచి ప్రయత్నించాడు.

నగ్నంగా రోడ్డు మీదకు వచ్చి కొరికేశాడు

నగ్నంగా రోడ్డు మీదకు వచ్చి కొరికేశాడు

ఒంటరి తనం తట్టుకోలేని ఆ యువకుడు తనకు వేసిన క్వారంటైన్ దుస్తులు చింపేశాడు. నగ్నంగా తయారైన ఆ యువకుడు ఇంటి నుంచి తప్పించుకుని వీధిలోకి పరుగు తీశాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న సమీప బంధువు అయిన 90 ఏళ్ల వృద్దురాలిని, పక్కన ఉన్న మరో తాతను ఇష్టం వచ్చినట్లు కొరికేశాడు. యువకుడి దాడితో ఒక్కసారి ఉలిక్కిపడిన స్థానికులు అతన్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేశారు. చివరికి యువకుడిని పట్టుకుని కాళ్లు చేతులు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కరోనా కాటుకు అవ్వ మృతి

కరోనా కాటుకు అవ్వ మృతి

క్వారంటైన్ లో ఉన్న యువకుడు తప్పించుకుని బయటకు వచ్చి కొరకడంతో గాయాలైన వృద్దురాలిని, తాతను తేని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై వృద్దురాలు మరణించిందని వైద్యులు చెప్పారు. తాతకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వృద్దురాలిని కొరికి చంపిన యువకుడిని తేని జిల్లాలోని భోది ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ముదిరిపోవడంతో ఆ యువకుడు వృద్దురాలిని కొరికి చంపాడా ? లేక డిప్రెషన్ తట్టుకోలేక చంపేశాడా ? అనే విషయం అర్థం కాకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. అతనికి కరోనా వైరస్ ఉందా ?, లేదా ? అనే విషయం తెలియడం లేదని, వైద్య నివేదికలు అందిన తరువాత అసలు విషయం తెలుస్తోందని అధికారులు, పోలీసులు అంటున్నారు.

English summary
Coronavirus (COVID 19): 90 years old woman dies after Coronavirus affected man biting near Theni in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X