వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

93ఏళ్ల వయస్సుల్లో సర్పంచ్‌గా ఎన్నికైన మహిళ

|
Google Oneindia TeluguNews

ముంబై: ఓ మహిళ 93 ఏళ్ల వయసులో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆమే మహారాష్ట్రలోని పుణె జిల్లా ఖేద్‌ తహసీల్‌ ధోరే భాంబర్వాడీకి చెందిన గంగూబాయ్‌ భంబురే. అత్యధిక వయస్సులో ఆమె సర్పంచ్ కావడం విశేషం.

ఆదివారం ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ధోరే భాంబర్వాడీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన గంగూబాయ్‌కి యావత్తు గ్రామం ఏకమొత్తంగా ఓట్లేసేసి గెలిపించేశారు. గంగూబాయ్‌ని విజేతగా ప్రకటించిన మరుక్షణం గ్రామస్తులంతా కలిసి భారీ ఎత్తున విజయోత్సవాన్ని నిర్వహించారు.

93 year old woman become Sarpanch in Pune

ఆమెను ఎత్తుకుని, కారులో తిప్పుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా 93 ఏళ్ల గంగూబాయ్‌ మాట్లాడుతూ.. ముందుగా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గట్టిగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

రోడ్ల పరిస్థితిని మెరుగుపరచడం కూడా తన లక్ష్యమని తెలిపారు. గ్రామానికి మంచి చేస్తుందనే ఆమెను ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమే సర్పంచ్‌గా ఎన్నికవడం ఆనందంగా ఉందన్నారు.

English summary
93 year old woman become Sarpanch in Pune in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X