వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

99శాతం రద్దుచేసిన పాతనోట్లు బ్యాంకుల్లో డిపాజిట్: ఆర్‌బిఐ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రద్దు చేసిన పాతనోట్లపై ఆర్‌బిఐ నోరు విప్పింది. రద్దు చేసిన పాత నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని ఆర్‌బిఐ ప్రకటించింది.పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత రూ. 15.28 లక్షల కోట్ల విలువైన 15.44 లక్షల పాత నోట్లు సెంట్రల్ బ్యాంకు వద్దకు చేరాయని ఆర్‌బిఐ ప్రకటించింది.

2016 మార్చివరకు 632.6 కోట్ల వెయ్యి రూపాయాల నోట్లు చలామణిలో ఉన్నట్టు ప్రకటించింది ఆర్‌బిఐ. అయితే 2017 మార్చి వరకు 8.9 కోట్ల వెయ్యి రూపాయాల నోట్లు తమ వద్దకు రాలేదని ఆర్‌బిఐ ప్రకటించింది.1.3 శాతం వెయ్యి రూపాయాల నోట్లు మాత్రమే వెనక్కి రాలేదని ఆర్‌బిఐ ప్రకటించింది.

తిరిగొచ్చిన పెద్ద నోట్లలో 7 లక్షల 62వేల నకిలీ నోట్లు ఉన్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. ప్రస్తుతం కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటు మొత్తం చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువలో సగం శాతం ఉన్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది.

99% of demonetised currency notes back with central bank: RBI annual report

2016-17లో కొత్త కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌కు సెంట్రల్ బ్యాంక్ రూ.7,965 కోట్లను వెచ్చించినట్టుగా రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది.మార్చి ముగింపు వరకు ఏడాది ఏడాదికి చలామణిలో ఉన్న కరెన్సీ20.2 శాతానికి కూడ తగ్గిపోయాయని ప్రకటించింది.

రద్దు చేసిన వెయ్యి, రూ.500 నోట్లను నిర్ణీత గడువులోపుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్‌బిఐ ఆదేశించింది. అయితే నిర్ధేశించిన గడువులోపుగా కనీసం 1 శాతం నోట్లు బ్యాంకులకు చేరలేదు.

English summary
The Reserve Bank of India on Wednesday said that almost 99 percent of banned Rs 500 and Rs 1000 notes that were demonetised last November have returned to the system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X