• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా: ‘9పీఎం.. 9మినిట్స్’సూపర్ సక్సెస్.. మళ్లీ రెచ్చిపోయిన తింగరోళ్లు.. పెద్ద ఎత్తున పటాకులు పేల్చి

|

ప్రపంచమంతటా కరోనా విలయతాండవం చస్తున్నవేళ.. భారత్ పైనా ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనాపై పోరును ఉధృతం చేయడంలో దేశమంతా ఒక్కటిగా నిలబడిందనే సందేశానికి గుర్తుగా.. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉన్నామనడానికి సంకేతంగా.. యుద్ధంలో ముందుండి పోరాడుతోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు సూపర్ సక్సెస్ అయింది.

భారతమాతకు జేజేలు..

భారతమాతకు జేజేలు..

సరిగ్గా రాత్రి 9 గంటలకు దేశం నలుమూలాలా ప్రజలు లైట్లు ఆర్పేసి.. దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వెలుగును ప్రసరింపజేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కచ్ నుంచి కటక్ దాకా జనం ఇండ్ల నుంచి బయటికొచ్చి, దీపాలు వెలిగించారు. భారతమాతకు జేజులు పలికారు. కరోనా యోధుల్ని తలుచుకున్నారు.

గో కరోనా గో..

గో కరోనా గో..

రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్ సభ స్పీకర్ తోపాటు ప్రజాప్రతినిధులుల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లముందు నిలబడి దేశమంతా ఒక్కటేనన్న సంకేతమిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో లైట్లు ఆర్పేసి, బయటికొచ్చి క్యాండిల్ వెలిగించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ఇంటి ముందు ‘ఓం' ఆకారంలో దీపాలు పర్చారు. అహ్మదాబాద్ లో గుజరాత్ పోలీస్ శాఖ ‘గో కరోనా గో' అక్షరక్రమాన్ని దీపాలుగా పేర్చిండం హైలైట్ గా నిలిచింది.

మళ్లీ ఆగమాగం..

మళ్లీ ఆగమాగం..

కాగా, గతంలో జనతా కర్ఫ్యూ సందర్భంలో జరిగిన తప్పులే.. ఆదివారం నాటి దీపాల కార్యక్రమంలోనూ చోటుచేసుకోవడం గమనార్హం. హైదరాబాద్ సహా దాదాపు అన్ని నగరాల్లో కొందరు.. భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఇలాంటి పనులు వద్దని ప్రభుత్వం ముందే హెచ్చరించినా పట్టనట్లుగా వ్యవహరించారు. ఇంకొందరైతే.. సామాజిక దూరం పాటించాలన్న సూత్రాన్ని మర్చిపోయి.. భారతమాతకు జేజేలు పలుకుతూ సామూహిక ర్యాలీలు తీశారు. చాలా చోట్ల స్ట్రీట్ లైట్లు బంద్ చేశారు. ఇలాంటి అపశృతుల్ని పక్కనపెడితే.. దేశం యావత్తూ కరోనాపై పోరులో ఒక్కటిగా ఉందనే సందేశాన్ని బలంగా వినిపించింది.

పెరిగిన కేసులు..

పెరిగిన కేసులు..

ఆదివారం రాత్రి నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 4122కు పెరిగాయి. మొత్తం 117 మంది చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 748 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 13 లక్షలకు, మరణాలు 68వేలకు చేరువయ్యాయి.

English summary
Candles and Diyas Burn Bright as India Turns Off the Lights to Support pm Modi 9 'pm, 9 Minutes' Call. people across india participated in the event. in many places some people burnt crackers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more