రేప్: మత గురువుకు 40 ఏళ్ల జైలు శిక్ష
త్రిశూర్: బాలిక మీద అత్యాచారం చేసిన కామాంధుడికి కేరళలోని న్యాయస్థానం కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడికి 40 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. బాలికను అన్ని విధాల ఆదుకోవాలని జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కేరళలోని పిచి ప్రాంతంలో సాల్వేషన్ అనే చర్చి ఉంది. కేరళలోని కోట్టాయం సమీపంలోని నడుంకడంకు చెందిన కే. జేమ్స్ (35) అనే వ్యక్తి ఈ చర్చిలో మత గురువుగా పని చేస్తున్నాడు. ఈ చర్చిలో ప్రార్థనలు చెయ్యడానికి (12) బాలిక వచ్చేది. బాలిక మీద జేమ్స్ కన్ను పడింది. ఎలాగైనా బాలికను లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు.

బాలికను బెదిరించి లైంగికంగా వేదించాడు. రెండేళ్ల క్రితం బాలిక మీద పదే పదే అత్యాచారం చేశాడు. బాలిక ఆరోగ్యంలో సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు వైద్యుల దగ్గర చూపించారు. బాలిక మీద అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు విచారణ జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి కే.పీ. సుధీర్ నిందితుడు జార్జ్ నేరం చేశాడని, అతనికి 40 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నామని తీర్పు చెప్పారు. పోలీసులు నిందితుడు జేమ్స్ ను జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications