కిరాతకం:శరీరంపై బ్లేడ్లతో గాయపర్చి, కళ్ళు పీకేసి,బాలికను ఏం చేశారంటే?

అభం శుభం తెలియని 14 ఏళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి బాలిక మేనత్తే తీవ్రంగా చిత్రహింసలు పెట్టింది. ఆ బాలిక శరీరంపై బ్లేడులతో గాయపర్చింది.కళ్ళ గుడ్లు పీకేసింది.

బెంగుళూరు:ఓ మేనత్త తన మేన కోడలును స్కూల్ నుండి కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చింది. కళ్లు పీకేసి, శరీరంపై బ్లేడులతో గాయపర్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కు సమీపంలోని సాధాగల్లీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ళ బాలిక 9వ, తరగతి చదువుతోంది. ఆమె మేనత్త మునియమ్మ అలియాస్ అన్నపూర్ణ అనే మహిళ ఈ బాలికకు మేనత్త అవుతోంది.

పాఠశాలలో ఉన్న బాలికను ఆమె మేనత్త అన్నపూర్ణమ్మ ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళింది. ఊరికి దూరంగా నిర్మానుష ప్రదేశంలో ఉన్న పాడుబడిన భవనంలోకి బాలికను తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టింది.

a 14 years old girl kidnap and harassed.

ఆ బాలిక శరీరంపై బ్లేడులతో తీవ్రంగా గాయపర్చింది. అంతేకాదు ఆ బాలిక కళ్ళలో పిన్నులు గుచ్చి కనుగుడ్లు తీసేసింది. తీవ్రగాయాల పాలైన ఆ బాలిక అరుపులు విన్న కొందరు ఆటోడ్రైవర్లు బాలికను ఆసుపత్రిలో చేర్చారు.

అయితే బాలికపై మేనత్త ఎందుకు ఈ రకమైన దారుణాలకు పాల్పడిందనే విషయాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+